పుచ్చకాయ గింజలను తింటే ఏమవుతుంది?

- April 12, 2019 , by Maagulf
పుచ్చకాయ గింజలను తింటే ఏమవుతుంది?

వేసవికాలంలో ఎండల్లో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది. అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.

1. పుచ్చ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది.

2. ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.

3. మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

4. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్దము పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి.

5. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.

6. ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది.

7. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com