‘చిత్రలహరి’ రివ్యూ

- April 12, 2019 , by Maagulf
‘చిత్రలహరి’ రివ్యూ

సాయధరమ్ తేజ్ గత చిత్రాల పరజాయాలను గుర్తుకు తేకుండా చిత్రలహారి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ని తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్ తో పాటు పాటలు కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచాయి. మరి చిత్రలహారి ఎలాంటి వినోదాలను అందించిందో తెలుసుకుందా..

 

కథ :
విజయ్ ( సాయి థరమ్ తేజ్) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక మొబైల్ ఆప్ మీద వర్క్ చేస్తుంటాడు. సమాజం దృష్టిలో ఫెయిల్యూర్ పర్సన్ గా కనిపించే విజయ్ జీవితంలో లహారి(కల్యాణి) తో ప్రేమ కొత్త హోప్ ని క్రియేట్ చేస్తుంది. విజయ్ దాచిన కొన్ని నిజాలు కళ్యాణి , విజయ్ ల మద్య దూరం పెంచుతాయి. ఆగిపోయిన తన జీవితంలో శాంతి (నివేతా పేతురాజు) కొత్త ఉత్సాహం నింపుతాయి. తన లైఫ్ లో ప్రేమ ,కెరియర్ రెండూ ఒక్కసారి దూరం అవుతాయి. మరి తన గెలుపు ఎలా సాద్యం అవుతుంది. విజయ్ జీవితంలో శాంతి, లహారి తెచ్చిన మార్పులేంటి అనేది మిగిలిన కథ..?

కథనం:
కొన్ని ఎమోషన్స్ ఎప్పటికీ పాతబడవు.. అలాంటి వాటిలో ఒకటి గెలిచే వాడి కథ. ఈ కాలంలో అయినా తన ఉనికి కోసం పోరాడే వాడి జీవితం ఆసక్తిగానే ఉంటుంది. ఎందుకంటే గెలిచిన పర్సంటేజ్ కంటే గెలావలనుకునే ప్రయత్నంలో ఉన్న వారి పర్సంటేజ్ ఎక్కువ గా ఉంటుంది కాబట్టి. కిషోర్ తిరుమల తీసుకున్న కథ లో హీరో అలాంటి గుర్తంపు లేని విజేతే. అయితే ఇలాంటి కథలు పాతవే అయినా దర్శకుడు అందించిన ఎక్స్ పీరియన్స్ మాత్రం కొత్త గా ఉంది. రచయిత నుండి కిషోర్ తిరుమల దర్శకుడిగా ఎదిగాడు కాబట్టి రచయిత కుండే బలం దర్శకుడిని డామినేట్ చేసింది. లవ్ ప్రపోజల్ సీన్ లవ్ బ్రేకప్ సీన్ రెండూ చాలా కిషోర్ తిరుమల లోని రచయిత కుండే పదును తెలియడానికి. జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కంటే వ్యక్తిత్వం ముఖ్యం అనే విషయం ఈ రెండు సన్నివేశాల్లో బలంగా ప్రొజెక్ట్ చేసాడు దర్శకుడు. విజయ్ క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ కొత్త గా ఉన్నాడు. అతని మేకోవర్ , బాడీ లాంగ్వేజ్ కూడా చాలా వరకూ రిఫైన్ చేసాడు దర్శకుడు. కెరియర్ సెట్ అవక, ఆ కారణంతో లవ్ లో ప్రాబ్లమ్స్ రావడం వంటి విషయాలు చాలా సాధారణం అయిన జనరేషన్ లో ఆ ప్రాబ్లమ్ ని కొత్త గా ప్రజెంట్ చేసాడు. తను రాసుకున్న సన్నివేశాలకు మాటలతో ప్రాణం పోసాడు. ఎవరేం చెప్పినా వెంటనే నమ్మేసే పాత్రలో కళ్యాణి, ఎవరేం చెప్పినా అసలు నమ్మని పాత్రలో నివిథా పాత్రకు పూర్తి న్యాయం చేసారు. ప్రేమలో నమ్మకం ఉండాలి కానీ నిరూపణలు కాదు. అనే పాయింట్ ని దర్శకుడు బ్రేకప్ సీన్ లో బాగా డిజైన్ చేసాడు. చాలా బ్రేకప్ సీన్స్ చూసుంటాం కానీ ఈ మూవీ లో బ్రేకప్ సీన్ రిఫరెన్స్ గా మిగలుతుంది. సాయిధర్మమ్ తేజ్ విజయ్ పాత్రను చాలా కాన్పిడెంట్ గా ప్లే చేసాడు. పోసాని కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అతని నటన ఆకట్టుకుంది. సునీల్ , వెన్నెల కిషోర్ పాత్రలు కొంత వరకూ ఎంటర్ టైన్ చేసాయి. సినిమాలో కథ, కథనాలు నిదానంగా సాగడం. పాత్ర ల తీరు ముందుగానే ఊహించే విధంగా ఉండటం ఈ సినిమా లో మైనస్ గా మిగిలాయి. ఈ సినిమాలో పోస్టర్ లో కనపడబకపోయినా పోసాని చాలా మంచి పాత్రను పోషించాడు. సాయిధరమ్ తేజ్ తండ్రి పాత్రను గుర్తుండే విధంగా పోషించాడు. తన టెంపర్ ని తగ్గించుకొని పాత్ర ను అర్ధం చేసుకొని నటించాడు. తను అనుకున్న విజయం దక్కేందుకు ఎక్కడా రాజీ పడకుండా విజయ్ చేసిన ప్రయాణం చిత్రలహారి. సమస్యను వదిలేయడం పరిష్కారం ఎలా అవుతుంది..? అనే ప్రశ్న యూత్ కి గట్టిగా తగులుతుంది. ప్రేమ కథ అనేకంటే జీవితాన్ని ఎలా ప్రేమించాలో చెప్పిన కథ అనడం కరెక్ట్ గా ఉంటుంది.

చివరిగా:
డీసెంట్ రోమాంటిక్ ఎంటర్ టైనర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com