కేరళ విషు ఫెస్టివల్‌ సద్యా కోసం సిద్ధమైన ఖతార్‌ రెస్టారెంట్స్‌

కేరళ విషు ఫెస్టివల్‌ సద్యా కోసం సిద్ధమైన ఖతార్‌ రెస్టారెంట్స్‌

భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వలసదారులకోసం ఖతార్‌లోని రెస్టారెంట్స్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కేరళ వాసులకు ఎంతో ప్రత్యేకమైన విషు ఫెస్టివల్‌ నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశాయి ఆయా రెస్టారెంట్స్‌. ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేకమైన మిడ్‌ డే మీల్‌ సాద్యాని అందించేందుకు రెస్టారెంట్స్‌ సన్నాహాలు పూర్తి చేశాయి. సాద్యాలో 24 నుంచి 28 డిషెస్‌ సింగిల్‌ కోర్స్‌లో వుంటాయి. అతి పెద్దది 64కి పైగా ఐటమ్స్‌ని కలిగి వుంటుంది. కేరళలోని వివిధ ప్రాంతాల్ని బట్టి ఇంగ్రెడియంట్స్‌ కొంచెం అటూ ఇటూగా మారతాయి. అన్నిటిలోనూ కామన్‌గా వుండే రైస్‌, పికెల్‌, దాల్‌, అవియాల్‌, కూట్టుక్కరి అతి ముఖ్యమైనవి. కేరళ వాసుల కోసం ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంగ్రెడియంట్స్‌ని హైపర్‌ మార్కెట్స్‌ అందుబాటులో వుంచాయి. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేనివారికి రెస్టారెంట్స్‌ అద్భుతమైన రుచితో సాద్యా ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి.   

 

Back to Top