కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం

- April 15, 2019 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం

కువైట్: కువైట్ విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని పార్శిల్ కలకలం సృష్టించింది. కువైట్‌ నుంచి అమెరికాకు దాన్ని కొరియర్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఓ పుస్తకం సైజులో ఉన్న ఆ పార్శిల్ ఏంటో, ఎవరు పంపారో వివరాలు తెలియరాలేదు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్యాకేజిని పరిశోధించడానికి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించింది. రొటీన్ కార్గో చెకింగ్‌లో భాగంగా కొరియర్ చేస్తున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఈ అనుమానాస్పద పార్శిల్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పార్శిల్‌లో బాంబు ఉందేమోనని వారు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పార్శిల్‌లో బ్యాటరీలు, డైనమైట్ తయారీలో ఉపయోగించే టీఎన్‌టీ అనే పదార్థం ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ పార్శిల్‌ను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com