మహిళకు సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

మహిళకు సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

22 ఏల్ళ యువకుడు, ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కారు బ్రోక్‌ డౌన్‌ అవడంతో, ఆమెకు సాయపడేందుకు వెళ్ళిన యువకుడ్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. మృతుడ్ని టాంజానియన్‌ వ్యక్తిగా గుర్తించారు. తన కారుతో, ఆగిపోయిన కారుని లాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ యువకుడు మరో వాహనం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందగానే ట్రాఫిక్‌ ఎక్స్‌పర్ట్స్‌, పెట్రోల్స్‌ మరియు నేషనల్‌ అంబులెన్స్‌ అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాన్ని అల్‌ కువైటీ హాస్పిటల్‌ మార్గ్యుకి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారు.  

 

Back to Top