షార్జా ఎయిర్‌పోర్ట్‌ డ్యూటీ ఫ్రీ: షాప్‌ అండ్‌ విన్‌ కాంపెయిన్‌ ప్రారంభం

షార్జా ఎయిర్‌పోర్ట్‌ డ్యూటీ ఫ్రీ: షాప్‌ అండ్‌ విన్‌ కాంపెయిన్‌ ప్రారంభం

దుబాయ్‌, అబుదాబీ తర్వాత షార్జా ఎయిర్‌పోర్ట్‌ సైతం సొంతంగా ర్యాఫిల్ డ్రా ప్రారంభించింది. షాప్‌ అండ్‌ విన్‌ క్యాంపెయిన్‌ ద్వారా విజేతలకు విలువైన బహుమతులు అందించనున్నారు. ఈ ర్యాఫిల్లో నాలుగు ఆడి మరియు బిఎండబ్ల్యు కార్లు వున్నాయి. ప్రయాణీకుల్ని ఎంకరేజ్‌ చేసేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. షార్జా ఎయిర్‌పోర్ట్‌ డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో 200 దిర్హామ్‌లు ఖర్చు చేసినవారికి కార్‌ ర్యాఫిల్ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఈజిప్ట్‌కి చెందిన జాకె నసీమ్‌ తొలి రఫాలెను ఏప్రిల్‌ 3న గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నసీమ్‌ యూఏఈకి అలాగే వైజ్‌ లీడర్‌షిప్‌కి, షార్జా ఎయిర్‌ పోర్ట్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డఫ్రీస్‌ జనరల్‌ మేనేజర్‌ మిడిల్‌ ఈస్ట్‌ మరియు ఇండియా, ఫెలిక్స్‌ బ్రూనర్‌ మాట్లాడుతూ, ఈ కొత్త ప్రారంభం చాలా ఆనందంగా వుందనీ, వినియోగదారులకు శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు. 

Back to Top