తులసి ఆకులను తీసుకుంటే లివర్...
- April 21, 2019తులసిని హిందువులు దైవంగా కొలచి పూజిస్తారు. తులసి దైవపరంగానే కాదు తులసి ఆకులను ఉపయోగించి ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకులను ప్రతి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
1. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరచి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ కలిగిస్తుంది.
2. తులసి ఆకులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. తులసిలో ఉన్న లక్షణాలు డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిలను తగ్గించటంలోసహాయపడతాయి. ఒత్తిడి తగ్గితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
4. లివర్‌లో ఉండే వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. లివర్ శుభ్రపడటమే కాకుండా మెటబాలిజం కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
5. తులసి ఆకులను ప్రతి రోజు తినటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
6. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వల్ల వాపులు,నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA