శివకార్తికేయన్‌ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం

- April 24, 2019 , by Maagulf
శివకార్తికేయన్‌ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం

ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులో ఈనెల 18న రెండో దశ పోలింగ్‌ జరిగింది. ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్‌ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో కార్తికేయన్‌ భార్య ఆర్తి పేరు ఉంది.. కార్తి కేయన్‌ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు.

అయితే దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి తీసుకుని ఓటు వేశానని చెప్పి వెళ్లిపోయారు శివకార్తికేయన్‌ . అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు . ఇది కాస్త సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారంటూ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అక్కడి పోలింగ్‌ కేంద్రం అధికారుల తప్పిదమే అంటూ.. వారిపై చర్యలకు ఆదేశింశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com