గంజి వల్ల ఉపయోగాలు
- April 26, 2019సాధారణంగా మన ఇంటిలో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని పారబోస్తుంటారు. వాస్తవానికి అలా చేయకూడదు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు గంజి నీటిలో ఉంటాయి. అందుకే గంజి నీటిని పారబోయకుండా వాటిని గోరు వెచ్చని ఉండగానే అందులో కాస్తంత ఉప్పు వేసి తాగడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
* వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి నీటిని తాగితే మంచిది. త్వరగా శక్తిని మళ్లీ పుంజుకుంటారు.
* గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది. విటమిన్లలోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు. పిల్లలకు గంజిని తాగిస్తే చాలా మంచిది. వారి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
* పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దాంతో వారికి కావాల్సిన ఆహారం సరిగ్గా అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది.
* విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
* చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం