ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత..వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

- May 01, 2019 , by Maagulf
ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత..వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

ఒడిశా వైపు ఫొని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేస్తోంది. NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 2 నుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. తీర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు ఇది వర్తిస్తుందని..మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సెలవులుంటాయని తెలిపింది. పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు..మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. 

సిక్కోలుపై ఫోని ఎఫెక్ట్ : సెలవులు రద్దు.. 
మరోవైపు అక్కడి వైద్యశాఖను అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసింది. సెలవులను రద్దు చేసింది వైద్య శాఖ. మే 15 వరకు విధులకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు ఉన్న ఫలంగా హెడ్ క్వార్టర్‌కు రిపోర్టు చేయాలంది. అత్యవసర సేవలకు అవసరమయ్యే మందులు, ఇతరత్రా వాటిని ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని తెలిపింది. 

పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు
గోపాల్ పూర్ - చాంద్‌బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఒడిశాలోని 11 జిల్లాల్లోపై తుఫాన్ ప్రభావం ఉండనుంది. మే 1వ తేదీ మధ్యాహ్నానానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com