రన్‌వేపై నుంచి జారి 136 మందితో నదిలో పడిపోయిన బోయింగ్ 737 విమానం
- May 04, 2019జాక్‌సన్‌విల్లె: రన్‌వేపై నుంచి జారిన ఓ బోయింగ్ 737 బోయింగ్ విమానం నేరుగా విమానాశ్రయం పక్కనే వున్న సెయింట్ జాన్ నదిలో పడిపోయిన ఘటన ఫ్లోరిడాలోని జాక్‌సన్‌విల్లెలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సిబ్బంది సహా మొత్తం 136 మంది ప్రయాణికులతో క్యూబా నుంచి జాక్‌సన్‌విల్లెకు వచ్చిన బోయింగ్ విమానం విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్‌వేపై నుంచి జారి నదిలో పడిపోయినట్టు జాక్‌సన్‌విల్లె పోలీసులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తుగా విమానం అడుగుభాగం మాత్రమే నీట మునగడంతో పెను ప్రమాదం తప్పింది.
విమానంలో వున్న ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్టు నగర్ మేయర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఒక విమాన ప్రమాదం మరిచిపోకముందే చోటుచేసుకుంటున్న మరో ప్రమాదం విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!