బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే...

- May 11, 2019 , by Maagulf
బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే...

టీ, కాఫీలలో చక్కెర వేసుకోవడం కంటే బెల్లం ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. స్వీట్లు కూడా బెల్లంతో తయారు చేసుకోవడమే ఉత్తమమని చెబుతున్నారు. అందరికీ బెల్లం ఇష్టం ఉండకపోవచ్చు కానీ దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. దగ్గు, జలుబును కూడా బెల్లం సులభంగా దూరం చేయగలదు.

అదేసమయంలో చక్కెర తింటే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కానీ బెల్లం వల్ల దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేసే శక్తి బెల్లానికి ఉంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్న సమయంలో బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్లు బెల్లం తింటే మంచిది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com