హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ వికటించి ఇండియన్‌ మహిళ మృతి

- May 13, 2019 , by Maagulf
హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ వికటించి ఇండియన్‌ మహిళ మృతి

దుబాయ్‌లోని 'బెట్టీస్‌ కేక్‌ టేల్స్‌'లో చెఫ్‌గా పనిచేస్తున్న బెట్టీ రీటా ఫెర్నాండెజ్‌ అనే భారతీయ మహిళ ఇటీవల హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయించుకోగా, కొద్ది రోజులకే కాంప్లికేషన్స్‌ తలెత్తి, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బెట్టీకి ఇద్దరు పిల్లలున్నారు. అల్‌ జహ్రా హాస్పిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మొహాయెమ్‌ అబ్దెల్‌ఘనీ మాట్లాడుతూ, సర్జరీ తర్వాతి పరిస్థితులపై ఆమెకీ, ఆమె కుటుంబ సభ్యులకీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందనీ, అల్‌ జహ్రా హాస్పిటల్‌ దుబాయ్‌లో ఆమెకు సర్జరీ నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్‌ అలాగే దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ మరియు జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ గైడ్‌ లైన్స్‌తో కలిసి రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుందని దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గత వారం 24 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, నోస్‌ సర్జరీ తర్వాత కార్డియాక్‌ అరెస్ట్‌, బ్రెయిన్‌ డేమేజ్‌తో 20 రోజులుగా కోమాలోకి వెళ్ళిపోయింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com