‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ

- May 17, 2019 , by Maagulf
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ

విడుదల తేదీ : మే 17, 2019

నటీనటులు : అల్లు శిరీష్‌, రుక్సార్ థిల్లాన్, నాగ‌బాబు, భరత్ తదితరులు.

దర్శకత్వం : సంజీవ్ రెడ్డి

నిర్మాత : మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని

సంగీతం : జుధా సాంధీ

సినిమాటోగ్రఫర్ : రామ్

ఎడిటర్ : నవిన్ నూలి

మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లుశిరీష్ ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సంజయ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పై ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉంది.
అల్లుశిరీష్ , రుక్సార్ థిల్లాన్ జంటగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో చూద్దాం…

కథ :

అమెరికాలో పుట్టిపెరిగిన అరవింద్(అల్లుశిరీష్) కి డబ్బు విలువ ఏమాత్రం తెలియదు. . తండ్రి సంపాదన తో విలాసాలు చేసే ఈ కుర్రాడు ఎలాంటి బాధ్యతలు లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతనికి జీవితం విలువ, డబ్బు విలువ తెలియాలని అరవింద్ తండ్రి(నాగబాబు)ఒక ప్లాన్ ప్రకారం కొడుకును , తన మేనల్లుడు (భరత్) ఇండియాకు పంపుతాడు . అక్కడ వాళ్లు ఎంబిఎ పూర్తిచేయాలని, నెలకు ఐదువేలతో గడపాలని కండీషన్ పెడతాడు. తిరిగి అమెరికాకు వచ్చేందుకు అన్నీ దారులు మూసి వేస్తాడు. విలాసాలలో జీవితం గడిపే అరవింద్, బాషా జీవితం ఒక్కసారిగా తల్లక్రిందులవుతుంది. అక్కడ నేహా(రుక్సర్) పరిచయం అవుతుంది.
అక్కడ సమస్యలతో అరవింద్ పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికాకు తిరిగా వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్న అరవింద్ కి కొత్త లక్ష్యాలు ఎదరవుతాయి. మరి వాటని అరవింద్ ఎలా పరిష్కరించాడు. తిరిగి అమెరికా వెళ్ళాడా లేదా అనేదిమిగిలిన కథ?

కథనం:
మళయాళం నుండి తెచ్చుకున్న ఈ కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేసారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చాలా జాగ్రర్తలు తీసుకున్నారు. ఈ సినిమలో అల్లు శిరీష్ తన తననటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ లో తన టైమింగ్ ని చూపెట్టాడు. భరత్ కాంబినేషన్ లో అల్లు శిరీష్ సన్నివేశాలు బాగా నవ్వించాయి. అమెరికా నా అమెరికా అనే పాటలో అతని హావభావాలు బాగా ఆకట్టుకున్నాయి. అమెరికాలో అలవాటుపడిన లైఫ్ స్టైయిల్ కి కంప్లీట్ భిన్నమైన జీవితం గడపడానికి ఆపాత్రలు పడే పాట్లు బాగా ఎంటర్ టైనింగ్ గా సాగాయి. హైదరాబాద్ లో తనకు కేటాయించిన రూమ్ నచ్చక ఒక స్టార్ హోటల్ కి షిప్ట్ అయినప్పుడు అక్కడ మేనజర్ పాత్ర చేసిన హార్ష వర్దన్ తో శిరీష్, భరత్ ల సన్నివేశాలను చాలా ఫన్ గా డిజైన్ చేసాడు దర్శకుడు. ఇక అల్లు శిరీష్ గత చిత్రాలకంటే ఈ సినిమాలో నటనలో ఈజ్ కనిపించింది. లుక్స్ పరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అతని బాడీ లాంగ్వేజ్ లో ప్రీనెస్ కనిపించింది. ఇక మెల్ల మెల్లగా పాట ఈ సినిమా కి హైలెట్ గా నిలించింది. ఇప్పటికీ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద సూపర్ హిట్ సాంగ్ గా కొనసాగుతున్న ఈ పాట వచ్చిన సందర్భమూ, పాట పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఒక క్యారెక్టరైజేషన్ ని ఒక సీన్ తోనే ఒక పాటతోనే కాకుండా నిదానంగా కథలోంచి వచ్చిన సంఘటనలనుండి నెమ్మదిగా మారడం బాగుంది. విలాసవంతమైన జీవితం, ప్రతి దానికి చూసుకుంటూ ఖర్చు పెట్టుకునే జీవితం ఈ రెంటికి మద్య ఒక పాత్రలో వచ్చే మార్పులను బాగా డిజైన్ చేసాడు దర్శకుడు సంజయ్. భరత్ కి ఎబిసిడి ఫరెఫెక్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. ప్రతి సన్నివేశంలోకూ భరత్ యాడ్ చేసిన ఫన్ ఉంది. అతని రియాక్షన్స్ తో సీన్ వెయిట్ ని పెంచాడు. ఒక కాలేజ్ కి స్టోరీ షిప్ట్ అయ్యాక ఒక బ్యూటిపుల్ ప్రేమకథను కనపడుతుంది. మెల్ల మెల్లగా పాట ఆ కథలోని ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. వెన్నెల కిషోర్ ట్రాక్ మొత్తం చాలా సరదాగా సాగింది. న్యూస్ ఛానల్స్ లో డిస్కషన్ పాయింట్ చుట్టూ అల్లుకున్న ఆ ట్రాక్ బాగా నవ్వించింది. సినిమా లో సెకండాఫ్ కి హీరో కి పెద్ద కాన్ల్ఫిక్ట్ లేకపోవడం ఎదురైన పొలిటికల్ విలన్ ని హీరోకి కూడా ఎక్కడా డైరెక్ట్ ఫైట్ లేకపోవడం వెలితిగా మారింది. అమెరికా నుండి వచ్చి డబ్బు విలువ తెలుసుకున్నాక హీరోకి పెద్ద లక్ష్యం లేకపోవడం తో కథలో ఆసక్తి తగ్గింది. ప్రీ క్లైమాక్స్ లో అల్లు శిరీష్ యూత్ ఐకాన్ కాంటెస్ట్ విన్నర్ గా చేసిన సన్నివేశం లో అతని నటన బాగుంది. ఆద్యతం నవ్వులతో సాగే అమెరికా బాయ్ ప్రయాణం సరదాగా ఉంది.

చివరిగా:
సరదాగా సాగే ప్రయాణం

 

--మాగల్ఫ్ రేటింగ్ 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com