'ఐ హేట్‌ యూ అమ్మ'... లఘుచిత్రం

- May 18, 2019 , by Maagulf
'ఐ హేట్‌ యూ అమ్మ'... లఘుచిత్రం

'ఐ హేట్‌ యూ అమ్మ'... లఘుచిత్రం. తరాల అంతరాల్లో తల్లి మాట, పాత్ర ఓవర్‌ ప్రొటెక్టివ్‌గా కనిపిస్తోంది. ఎంత వయసుకొచ్చినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే విషయాన్ని పదేపదే మాట్లాడే యుక్తవయస్సు పిల్లలే, అమ్మ భయాల దగ్గరకొచ్చేసరికి విపరీత అసహనానికి లోనవుతారు. చాదస్తంగా కొట్టిపడేస్తారు. తల్లి తమను ఇంకా చిన్నపిల్లల్లా చూస్తోందని ఫ్రస్టేట్‌ అయ్యేవారే, తల్లి జాగ్రత్తల్ని అర్థంచేసుకోవడంలో ఫెయిల్‌ అవుతుంటారు. ఈ జెనరేషన్‌ గ్యాప్‌ సమస్య చుట్టూతానే ఈ కథ నడుస్తుంది. ఆరు నిమిషాల చిన్ని చిత్రమే అయినా, చాలా పెద్ద విషయాన్ని చర్చిస్తుంది. 'ఏదైనా గాయపరిచే వస్తువుకి దూరంగా జరగడం...' అనే ఓ చిన్న మాటతో తల్లి జాగ్రత్త మనస్తత్వాన్ని యంగ్‌ మైండ్స్‌కి అర్థం చేయించే ప్రయత్నం చేసిన దర్శకడు సతీష్‌ రెడ్డి మల్లిడి, రచయిత భార్గవ్‌ రైట్స్‌ను అభినందించాలి. సోనియా సింగ్‌ నటనతో ఆకట్టుకుంటుంది. శరత్‌ అంకిత్‌ నడిమింటి, చిన్నవాసుదేవ రెడ్డి ఈ చిత్ర నిర్మాతలు. యూట్యూబ్‌ చానెల్‌ 'హే పిల్లా..!'లో ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com