హైదరాబాద్ లో మండుతున్న ఎండలు

- May 20, 2019 , by Maagulf
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు

హైదరాబాద్: భానుడు భగభగలాడిపోతున్నాడు. మండుతున్న ఎండలతో ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా ఉంది నగరంలోని వేడి. కాంక్రిట్ జంగిల్ గా మారిపోయిన హైదరాబాద్ నగరంలో వేసవివచ్చిదంటే చాటు ప్రజలు హడలిపోతున్నారు. 10 దాటికుండానే రోడ్లపై జనాలు కనిపించటంలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 
నగరంలోని పలు ప్రాంతాలలు ఆదివారం (మే19) 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ స్టేట్ డెవెలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( TS DPP) తెలిపిన వివరాల ప్రకారం..బహదూర్ పురాలు 43.8 డిగ్రీలు..అమీర్ పేట 43.4, మాదాపూర్ 43.2, బీహెచ్ఈఎల్ 43.1 డిగ్రీలు,ఉష్ణోగ్రత 42.7 సెల్షియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతారవణ శాఖ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం, రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున అధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో 43 డిగ్రీలు చొప్పున రికార్డయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com