నీళ్లు నిలబడి తాగితే చాలా..

- May 21, 2019 , by Maagulf
నీళ్లు నిలబడి తాగితే చాలా..

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత వరకేనండి. కానీ నిలబడి నీళ్లు తాగితే చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని తెలియదు చాలా మందికి. ఇలా తాగితే ఆరోగ్య పరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
ఇలా తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని.. దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.


నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి కీళ్ల నొప్పులకు దారి తీస్తాయి.
కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలోకి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం కూడా తగ్గుతుంది.
సో.. తెలియక ముందు తాగేసాం. మరి తెలిసాక కూడా అలానే చేయకూడదు కదండీ. కూర్చుని తాగే ప్రయత్నం చేస్తూ వ్యాధులకు దూరంగా ఉంటే మంచిదేమో ఓ సారి ఆలోచించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com