యూ.ఏ.ఈ:ఇఫ్తార్ విందుతో గిన్నీస్ రికార్డ్

- May 21, 2019 , by Maagulf
యూ.ఏ.ఈ:ఇఫ్తార్ విందుతో గిన్నీస్ రికార్డ్

యూ.ఏ.ఈ:ముస్లిం సోదరుకలు అతి పవిత్రమైన మాసం రమదాన్. ఆకాశంలలో నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే రమదాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి ఆహారాన్ని తీసుకుంటారు. ఖీర్ (పాయసం),ఖర్చూరం వంటి బలాన్నిచ్చే ఫ్రూట్స్ తో ఉపవాసాన్ని ముగిస్తారు. 
ఇలా తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని'సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని' ఇఫ్తార్' అని అంటారు. 


ఈ ఇఫ్తార్ విందులో దుబాయ్ లో భారత్ కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నీస్ రికార్డ్ సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు కొనసాగిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవునా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్‌న్యూస్ తెలిపింది. శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తినటం వల్ల జంతువధను అరికట్టవచ్చుని తెలిపారు. ఈ రికార్డు సాధించడంలో సహకారాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పీసీటీ హ్యుమానిటీ చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com