డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8,581 ఉద్యోగాలు..

- May 21, 2019 , by Maagulf
డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8,581 ఉద్యోగాలు..

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు.. అప్రెంటస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ): 8,581  జోనల్ వారీగా ఖాళీలు..
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1251  సెంట్రల్ జోనల్ ఆఫీస్ ( భోపాల్) : 525  ఈస్ట్రర్న్ జోనల్ ఆఫీస్(కోల్‌కతా): 922
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్(పాట్నా) : 701  నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ): 1130  నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) : 1042
సదరన్ జోనల్ ఆఫీస్ ( చెన్నై): 1257  వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1753
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి పైవాటిలో ఏదైనా ఒక డివిజన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయసు: 01.05.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా  ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.34,503 స్టైఫండ్ చెల్లిస్తారు. తరువాత ప్రొబెషనరీ పీరియడ్‌లో నెలకు రూ.21,865 బేసిక్ పే ఉంటుంది. జీతం నెలకు రూ.37,345. ఇతర భత్యాలు అదనం.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2019  దరఖాస్తుకు చివరి తేదీ: 09.06.2019  ప్రిలిమనరీ పరీక్ష: జులై 6,13 తేదీల్లో
మెయిన్ పరీక్ష: 10.08.2019

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com