మక్కా, జెడ్డాపై మిస్సైల్‌ దాడిని ఖండించిన బహ్రెయిన్‌

- May 22, 2019 , by Maagulf
మక్కా, జెడ్డాపై మిస్సైల్‌ దాడిని ఖండించిన బహ్రెయిన్‌

యెమెన్‌కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్‌ ప్రయోగించడాన్ని బహ్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్‌ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్‌ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్‌ని డిస్ట్రాయ్‌ చేసిన సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ని ఈ సందర్భంగా బహ్రెయిన్‌ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్‌ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్‌ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్‌ పిలుపునిచ్చింది. తైఫ్‌ మీదుగా వస్తున్న మిస్సైల్స్‌ని సౌదీ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ధ్వంసం చేశాయి. మిస్సైల్‌ శకలాలు వాడి జలీల్‌లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్‌ వ్యాఖ్యానించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com