క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఉద్యోగం.. జీతం రూ.26,57,655..

- May 22, 2019 , by Maagulf
క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఉద్యోగం.. జీతం రూ.26,57,655..

లండన్:రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవేంటి.. ఇక్కడ రాణీగారు తల్చుకున్నారు. ఓ మాంచి సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్ కావాలని. అందుకోసం ఎంతైనా ఇస్తామంటూ బంపరాఫర్ ప్రకటించింది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్ మేనేజర్ టీమ్. తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్లో ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు పొందు పరిచారు. రాణి ఎలిజబెత్‌ను ప్రపంచానికి మరింత కొత్తగా, వినూత్నంగా పరిచయం చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాకు సంబంధించిన వాటిల్లో బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి మిలియన్ల మంది ఫాలోవర్స‌తో ఆకట్టుకోవాలి. ఇందుకు వేతనం ఎంత ఇచ్చేది కూడా పొందు పరిచారు.

దాదాపు 30,000 బ్రిటీష్ పౌండ్లు. అదే మన రూపాయిల్లో అయితే రూ.26,57,655. అంతే కాదండోయే ఈ భారీ వేతనంతో పాటు మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. జీతంతో పాటు 15 శాతం పెన్షన్ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తరువాత నుంచి అప్లై అవుతుంది. సంవత్సరానికి 33 రోజులు సెలవులు. ఇందులో బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి. భోజనం ఫ్రీ. ఇంక మీజాబ్‌లో మీరు మరింత ముందంజలో ఉండడానికి ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీని నేర్చుకునే అవకాశం. వారానికి 5 రోజులే పని దినాలు.

ఇంతకీ ఈ జాబ్‌కి అర్హత ఏంటో చెప్పలేదు కదూ.. డిగ్రీ పాసై ఉండి ఏదైనా వెబ్ సైట్‌లో పని చేసి అనుభవం ఉండాలి. దాంతో పాటు అద్భుతమైన ప్లానింగ్ ఫొటోగ్రఫీ, వీడియో నైపుణ్యం అవసరం. ఏదైనా ఇష్యూకి సంబంధించి వెంటనే స్పందించాలి. డిజిటల్ సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్స్ డెవలప్‌మెంట్స్ మీద పట్టు ఉండాలి. సృజనాత్మకత నైపుణ్యం అవసరం. ఇంకా రైటింగ్ స్కిల్స్, ఎడిటోరియల్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాంలలో రోజు వారీ వార్తా విశేషాలను ఫీచర కథనాలను తెలుసుకుని పరిశోధించాలి. వివిధ ఆడియన్స్ గ్రూప్‌లను ఆకర్షించాలి. సో.. ఈ టాలెంట్లన్నీ మీలో ఉంటే మీరూ అప్లై చేసుకోవచ్చు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఉద్యోగం కొట్టేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com