ఎల్‌పీజీ గ్యాస్ ప్రమాదాలు.. రూ. లక్షల్లో ఉచిత బీమా..!

- May 24, 2019 , by Maagulf
ఎల్‌పీజీ గ్యాస్ ప్రమాదాలు.. రూ. లక్షల్లో ఉచిత బీమా..!

ఇండియా:కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటాం కానీ దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఇందుకోసం కస్టమర్ ప్రత్యేకంగా పాలసీ తీసుకోవలసిన అవసరం ఏమీ లేదు. ఎల్‌పీజీ కంపెనీలు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాయి. దీనికి కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. ఎల్‌పీజీ యాక్సిడెంట్ బాధితులు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా ఆయిల్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పబ్లిక్ లయబిలిటీ పాలసీ కింద పర్సనల్ యాక్సిడెంట్ కవర్, వైద్య ఖర్చుల రీయింబర్స్, ప్రాపర్టీ డ్యామేజ్ కవర్ వంటి సదుపాయాలు పొందొచ్చు. ఎల్‌పీజీ కస్టమర్లు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూటర్‌కు తెలియజేయాలి. ఆ ఏజెన్సీ ఆయిల్ కంపెనీ, ఇన్సూరెన్స్ సంస్థకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. కస్టమర్లు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. డెత్ సర్టిఫికెట్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, వైద్య బిల్లులు వంటి వాటిని కంపెనీకి అందిస్తే సరిపోతుంది. ప్రమాదం వలన గ్యాస్ అగ్రిమెంట్‌లోని రిజిస్టర్డ్ ఇంటికి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ని నియమించుకుంటుంది. వారే నష్టాన్ని అంచనా వేస్తారు. నిజానికి గ్యాస్ ఏజెన్సీ వారే ఎల్‌పీజీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి కస్టమర్లకు తెలియజేయాలి. కంపెనీలో నోటీస్ బోర్డు మీద ఇన్సూరెన్స్‌కి సంబంధించిన వివరాలు డిస్‌ప్లే చేయాలి. కానీ అలా జరగడం లేదు. అందుకే కస్టమర్లకు ఇన్సూరెన్స్ గురించి తెలియకుండా పోతుంది.

ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకతలు..
ప్రమాదం జరిగినప్పుడు వ్యక్తి మరణిస్తే.. రూ.6లక్షలు, వైద్య ఖర్చుల కోసం గరిష్టంగా రూ.2 లక్షలు, ప్రాపర్టీ డ్యామేజ్ కోసం రూ.2 లక్షలు, ప్రమాద ఘటనకు గరిష్టంగా రూ.30 లక్షలను వైద్య ఖర్చుల కోసం ‘ఇండెన్ గ్యాస్’ కన్స్యూమర్లు పొందవచ్చు.
ఇక హెచ్‌పీ కన్స్యూమర్లు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద వ్యక్తి మరణానికి రూ.5 లక్షలు, వైద్య ఖర్చుల కోసం గరిష్టంగా రూ.15 లక్షలు పొందవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.1 లక్ష పరిమితి ఉంటుంది. తక్షణ సాయం కోసం వ్యక్తికి రూ.25,000 ఇస్తారు. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే రూ.1 లక్ష పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com