సిరియాలో వైమానిక దాడి..14 మంది మృతి

- May 30, 2019 , by Maagulf
సిరియాలో వైమానిక దాడి..14 మంది మృతి

డమాస్కస్‌: సిరియాలో వైమానిక దాడిలో 14 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిరియాలోని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ చీఫ్‌ రామి అబ్దెల్‌రహ్మాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...తిరుగుబాటుదారుల జనాభా అధికంగా ఉన్న ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లో బుధవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దాడికి పాల్పడినట్టు ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే, ఇద్లిబ్‌లోని తిరుగుబాటుదారుల తరిమివేత కోసం సిరియా బలగాలు కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. వైమానికదాడికి పాల్పడింది సిరియా సైన్యమేనని అబ్దెల్‌ రహ్మాన్‌ అనుమానిస్తున్నారు. కాగా, ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లో సిరియా బలగాలు వైమానిక దాడికి పాల్పడ్డా యని వచ్చిన ఆరోపణలను అస్సద్‌ సర్కార్‌ ఖండించలేదు. ఇద్లిబ్‌లో అక్రమ చొరబాటుకు ప్రయత్నిస్తున్న హయాత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ తిరుగుబాటుదారులను తరిమివేస్తామని సిరియా ఆర్మీ గతనెలలో ప్రకటించింది. సిరియాలో జరిగిన వైమానికదాడిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా బలగాలకు, తిరుగుబాటుదారులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరులో సామాన్య పౌరులు సమిధలవు తున్నారని తెలిపింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈఏడాది ఏప్రిల్‌30నాటికి 3.7లక్షల మంది మృతిచెందినట్టు ఐరాస వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com