ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

- June 14, 2019 , by Maagulf
ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఎక్సర్‌సైజ్ : చాలామంది ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. అయితే, ఈ సమయంలో అతిగా చేయకూడదు.. ఎందుకంటే సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. శరీరం త్వరగా అలసిపోతుంది. ముఖ్యంగా ఉదయం మాత్రమే ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి.. ఎక్సర్‌సైజ్ విషయంలో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

స్నానానికి ముందు మసాజ్ : ఈ సమయంలో స్నానాని02కి ముందు శరీరాన్ని కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొన్ని పరిశోధనల్లో ఈ మసాజ్‌తో జీర్ణసమస్యలు కూడా తగ్గిపోతాయని తేలింది.

అతిగా వేడి, చల్లని పదార్థాలు తీసుకోకపోవడం : ఈ సమయంలో ఎక్కువగా వేడి, చల్లగా ఉన్న డ్రింక్స్, ఫుడ్ని తీసుకోకపోవడం మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్, జ్యూస్‌లు తాగుతుంటారు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. కాబట్టి.. ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

కాఫీ, టీలు తగ్గించడం : అసలే మండే ఎండలు.. అందులోనూ కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి.. ఈ విషయంలోనూ జాగ్రత్తపడడం ముఖ్యం.

జంక్ ఫుడ్ తగ్గించడం : గ్రిల్డ్ ఫుడ్, చిప్స్, చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్‌ తగ్గించాలి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.

పండ్లు తీసుకోవడం : వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. పుచ్చకాయలు, దోసకాయలు, బ్రకోలి ఇలాంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో నీటిశాతం పెరిగుతుంది.

రాత్రి పడుకునే ముందు మసాజ్ : రాత్రి పడుకునే ముందు కూడా ఏవైనా అరోమా ఆయిల్స్ అంటే శాండిల్, జాస్మిన్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేస్తుండాలి. ఒకవేళ వీలుకాకపోతే.. హెడ్‌ మసాజ్ అయినా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ పూర్తిగా తగ్గుతుంది. మరునాటి ఉదయానికి మనం చాలా యాక్టివ్‌గా ఉంటాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com