యువకులలో శరీర బరువు తగ్గించే చిట్కాలు

- June 23, 2019 , by Maagulf
యువకులలో శరీర బరువు తగ్గించే చిట్కాలు

శారీరకంగా కానీ, మానసికంగా కానీ, యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు నిరంతరంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. చదువుకోవడానికి వారి ఇంటిలో కానీ, పాటశాలలో కానీ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి వలన వారు తినే ఆహరం మీద శ్రద్ధ పెట్టకపోవడం వలన అధిక బరువు లేక ఊబకాయం వస్తుంది. కావున భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వయసుకు తగ్గ బరువుతో పెరగాలి. ఇలా అధిక బరువు ఉన్న అబ్బాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు. అలాంటి కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

ఆరోగ్యకరమైన ఆహారం
అబ్బాయిలు బరువు తగ్గడానికి ఎలాంటి మంత్రాలు, మ్యాజిక్ చిట్కాలు లేవు. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే అందుబాటులో ఉన్న దారి. బర్గర్ లు, పిజ్జాలు మరియు నూనెతో చేసిన వంటలు పూర్తిగా తగ్గించాలి. ఎప్పుడైనా ఒకసారి తింటే ఫర్వాలేదు, కానీ ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఐరన్, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహరం తీసుకుంటే ఆరోగ్యంగా, మంచి బరువుతో ఉంటారు. నీటి సేకరణ కూడా ఎక్కువగా జరపాలి. మంసాహారాలు మరియు నూనె వంటలు తినడం వలన బరువు ఎక్కువై, కొవ్వు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది.

ఆహార లెక్కింపు చేయడం
ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా, పూర్తిగా నమలాలి. ఇలా చేయడం వలన మెదడుకు తింటున్నారనే సమాచారం చేరి, కడుపు నిండగానే తినడం ఆపేయమని సలహా ఇస్తుంది. ఒక రోజంతా కొన్ని నిర్ణీతమైన సమయాల్లో ఆహరం తీసుకోవడం ఉత్తమం. ప్రతీ 2 నుంచి 3 గంటలకి ఒకసారి ఖచ్చితంగా తినాలి. ఒకేసారి ఎక్కువగా తినడం వలన కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. కొంత మందికి రాత్రి సమయాల్లో కూడా ఆకలి అవుతుంది. అలాంటి సమయాల్లో తినకుండా మంచి నీరు త్రాగాలి. రాత్రుల్లో దాహంని కూడా ఆకలి అని భ్రమపడడం సహజం. తినే ప్రతీ ఆహరం మితిమీరకుండా తినడం అలవాటుగా మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వ్యాయామం
బరువు తగ్గాలంటే తక్కువగా లేక మితంగా తినాలి, కానీ అబ్బాయిలు తక్కువ బరువుతో పరిపూర్ణ శరీరం కావాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు తగిన వ్యాయామం చేయాలి. కార్డియో, ఏరోబిక్ మరియు కండరాలని బలోపేతం చేసే వ్యాయామాలు చేసినట్లయితే బరువు తగ్గి, మంచి శరీరం మీ సొంతమవుతుంది. ఇలాంటి వ్యాయామాలు చేసే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి.  ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది.

తగినంత విశ్రాంతి
తగిన ఆహరం తీసుకొని, వ్యాయామం చేయడం వలన శరీరం చాలా ఒత్తిడికి గురవుతుంది మరియు శరీరం నీరసంగా మారుతుంది. కావున వ్యాయామం తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి వలన మనసు, శరీరం తేలికపడుతుంది. అంతేకాకుండా, కండరాలు కూడా బలోపేతంగా అవుతాయి. సరైన చిట్కా ఏంటంటే, ఆటలు మరియు పార్టీలు తగ్గించి విశ్రాంతి తీసుకోవడం మంచిది.

తల్లితండ్రులు: విమర్శించకండి, ప్రోత్సహించండి
చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు ఎవరైనా విమర్శించటం వలన మానిసికంగా బాధపడతారు. తల్లితండ్రులు మంచి ఉదాహరణలతో మరియు సలహాలతో పిల్లలని బరువు తగ్గడానికి ప్రోత్సహించాలి అంతేకానీ విమర్శించకూడదు.


ఇలాంటి చిట్కాలు పాటిస్తే బరువు తగ్గి, ఆరోగ్యమైన శరీరం మీ సొంతమవుతుంది. కానీ, వీటిని పాటించే ముందు వైద్యుడి సలహా కూడా తప్పనిసరి అవసరం. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే ఈ చిట్కాలను పాటించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com