కాన్సులేట్‌ ముందు 'క్యూ'కి చెక్‌ పెట్టే యాప్‌

- June 24, 2019 , by Maagulf
కాన్సులేట్‌ ముందు 'క్యూ'కి చెక్‌ పెట్టే యాప్‌

యూ.ఏ.ఈ:కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, ఓ మొబైల్‌ అప్లికేషన్‌ని యూఏఈలోని భారతీయుల కోసం ప్రారంభించింది. కాన్సులర్‌ అపాయింట్‌మెంట్స్‌కి సంబంధించి 'క్యూ' అవసరం లేకుండా ఈ యాప్‌ ఉపకరిస్తుంది. జూన్‌ 23 నుంచి ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. 'క్యూ టిక్కెట్‌' అనే ఈ యాప్‌ని భారత కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ ప్రారంభించారు. దుబాయ్‌లోని కాన్సులేట్‌ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. క్యూ టిక్కెట్‌ ప్రస్తుతం ఐవిఎస్‌ సెంటర్స్‌కి మాత్రమే ఉపకరిస్తుంది. బిఎల్‌ఎస్‌లకు ఉపయోగపడదు. ఇదిలా వుంటే, యూఏఈలో భారతీయుల పాపులేషన్‌కి సంబంధించిన లెక్కలు చూస్తే 3.3 మిలియన్లుగా కనిపిస్తుంది. దుబాయ్‌ కాలేజ్‌కి చెందిన స్టూడెంట్‌ క్రిస్‌ భార్గవ బ్రెయిన్‌ చెయిల్డ్‌ ఈ క్యూ టిక్కెట్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com