కృష్ణవంశీ దర్శకత్వంలో'రుద్రాక్ష'

- June 25, 2019 , by Maagulf
కృష్ణవంశీ దర్శకత్వంలో'రుద్రాక్ష'

దర్శకుడు కృష్ణవంశీకి గత కొన్నాళ్లుగా సరైన సినిమా రాలేదు. 'నక్షత్రం' తరవాత ఆయన మెగాఫోన్‌ పట్టలేదు. కాస్త విరామం తరవాత మళ్లీ ఆయన 'యాక్షన్‌.. కట్‌' చెప్పబోతున్నారని తెలిసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. 'రుద్రాక్ష' అనే పేరు పరిశీలిస్తున్నారు. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ఓ స్టార్‌ నాయికని ఎంచుకునే పనిలో చిత్రబృందం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com