దుబాయ్‌ బస్‌ ప్రమాదం: డ్రైవర్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష, 3.4 మిలియన్‌ దిర్హామ్‌ల బ్లడ్‌ మనీ జరీమానా?

- June 26, 2019 , by Maagulf
దుబాయ్‌ బస్‌ ప్రమాదం: డ్రైవర్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష, 3.4 మిలియన్‌ దిర్హామ్‌ల బ్లడ్‌ మనీ జరీమానా?

దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌పై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో డ్రైవర్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష విధించాలనీ, అలాగే 3.4 మిలియన్‌ దిర్హామ్‌ల బ్లడ్‌ మనీ చెల్లించాల్సిందిగా ఆదేశించాలనీ ప్రాసిక్యూషన్‌ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారణ తాజాగా న్యాయస్థానంలో జరిగింది. ఈ సందర్బంగా 53 ఏళ్ళ ఒమనీ డ్రైవర్‌పై అభియోగాలు నమోదయ్యాయి, వాటిపై విచారణ జరిగింది. 31 మందిని తీసుకెళుతున్న బస్సు, జూన్‌ 6న రోడ్‌ హైట్‌ రిస్ట్రిక్షన్‌ బ్యారియర్‌ని అతి వేగంతో ఢీకొట్టింది. అల్‌ రష్దియా మెట్రో స్టేషన్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 31 మంది ప్రయాణీకుల్లో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయాలపాలయ్యారు. అందులో ఒకరు వైద్య చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 12 మంది భారత జాతీయులు, ఇద్దరు పాకిస్తానీయులు, ఒకరు ఒమన్‌, మరొకరు ఫిలిప్పీన్‌కి చెందినవారున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com