కువైట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల లోపే!

- June 26, 2019 , by Maagulf
కువైట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల లోపే!

కువైట్‌: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) వెదర్‌ ఫోర్‌కాస్టర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ కరావి మాట్లాడుతూ, సమ్మర్‌ సీజన్‌ కువైట్‌లో అధికారికంగా ప్రారంభమయ్యిందని అన్నారు. రానున్న రోజుల్లో కువైట్‌లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగబోతున్నాయనీ, అత్యధికంగా ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. 48 నుంచి 51 డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు కావొచ్చనీ, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 52 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని ఆయన వివరించారు. ఆగస్ట్‌ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. ఇదిలా వుంటే, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డైరెక్ట్‌ సన్‌ ఎక్స్‌పోజర్‌కి ఎవరూ గురి కాకూడదని ఆయన హెచ్చరించారు. ఇదిలా వుంటే, 2016లో కువైట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పట్లో నమోదైన 53.9 డిగ్రీల ఉష్ణోగ్రత అంతకు ముందున్న రికార్డుల్ని బద్దలుగొట్టింది. ప్రపంచంలోనే మూడో అత్యధిక ఉష్ణోగ్రత ఇది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com