బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ

- June 28, 2019 , by Maagulf
బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ

స్టార్ కాస్ట్ : శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, రాహుల్ తదితరులు..
దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ
నిర్మాతలు: విజయ్‌ కుమార్‌
మ్యూజిక్ : వివేక్‌ సాగర్‌
విడుదల తేది : జూన్ 28, 2019 

రివ్యూ : 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..హీరో గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ విష్ణు తాజాగా బ్రోచేవారెవరురా అంటూ సరికొత్త కథ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? శ్రీ విష్ణు మరోసారి ఆకట్టుకున్నాడా లేదా..? వివేక్ ఆత్రేయ ఖాతాలో హిట్ పడిందా లేదా..? అనేది పూర్తీ రివ్యూ లో చూద్దాం.

కథ :

శ్రీవిష్ణు (విశాల్) ప్రియదర్షి (విశాక్) రాహుల్ రామకృష్ణ (ర్యాంబో) ఈ ముగ్గురు మంచి స్నేహితులు..ఒకరంటే ఒకరికి ఏంతో ఇష్టం. క్షణం కూడా ముగ్గురు ఒంటరిగా ఉండరు. ఈ ముగ్గురు కూడా ఇంటర్ పాస్ అవ్వడానికి ఎంతో కష్టపడుతుంటారు. అప్పటికే మూడు సార్లు ఫెయిలై..నాలుగోసారి ఇంటర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చదివే కాలేజీ లో నివేదా థామస్ (మిత్ర) కూడా జాయిన్ అవుతుంది.

ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ మిత్ర తండ్రి..కానీ ఆమె ఆయనతో మాట్లాడకుండా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో విశాల్ గ్యాంగ్ కు దగ్గరవుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో తండ్రికి దూరం కావాలని డిసైడ్ అయినా మిత్ర కు విశాల్ గ్యాంగ్ హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ ఏంటి..? మిత్ర ..తన తండ్రికి ఎందుకు దూరంగా ఉంటుంది..? మిత్ర కు చేసిన సాయం వల్ల విశాల్ గ్యాంగ్ ఎలాంటి కష్టాలు పడతారు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* నివేద థామస్

* కామెడీ

* సెకండ్ హాఫ్

మైనస్ :

* అక్కడక్కడా స్లో నేరేషన్

* ఎమోషన్ సన్నివేశాలు

* సింపుల్ క్లైమాక్స్

నటీనటుల పెర్పామెన్స్ :

* శ్రీవిష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మొదటి నుండి కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన ఈయన..ఈ సినిమాలో కూడా తనదైన నటన కనపరిచి ఆకట్టుకున్నారు.

* నివేద నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. గ్లామర్ తోనే కాక తన నటనతో కూడా మరోసారి ప్రేక్షకులను అలరించింది.

* ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ మాములుగా లేదు. ఇద్దరు ఇద్దరే అని మరోసారి నిరూపించుకున్నారు. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్లో కడుపు చెక్కలు అయ్యాలే నవ్వించారు.

* సత్యదేవ్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* వివేక్ సాగర్‌ మ్యూజిక్ తో పాటు నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.

* సాయి శ్రీరాం సినిమా ఫొటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది.

* రవితేజ గిరిజాల ఎడిటింగ్ లో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు కనిపించాయి.

* విజయ్ కుమార్ మన్యం నిర్మాణ విలువలు బాగున్నాయి.

* వివేక్ ఆత్రేయ డైరెక్షన్ విషయానికి వస్తే.. ఎలాగైతే కథ రాసుకున్నారో..తెరపై అలాగే చూపించడంలో సక్సెస్ అయ్యారు. నటి నటులను చక్కగా వినియోగించుకున్నారు. కామెడీ తో థియేటర్ అంత నవ్వుల్లో ముంచేశాడు. ఫస్ట్ హాఫ్ కాస్త అక్కడక్కడా స్లో గా తీసుకెళ్లినట్లు అనిపించినా..సెకండ్ హాఫ్ మాత్రం పరుగులు పెట్టించాడు. చక్కటి కామెడీ తో నడిపించాడు. కాకపోతే క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్ గా ముగించేశాడు. ఓవరాల్ గా మాత్రం కామెడీ తో సినిమాను నడిపించి సక్సెస్ అయ్యాడు.

ఈ చిత్రానికి మాగల్ఫ్ వారి  రేటింగ్ : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com