ఈ మొలక ధాన్యాలతో ఉపయోగాలు

- June 30, 2019 , by Maagulf
ఈ మొలక ధాన్యాలతో ఉపయోగాలు

మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన తర్వాత గింజలు చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.నిజానికి వీటిలో 35 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి. జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది. మొలకలను తినడం వ‌ల్ల‌ జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది.

1. మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మం, నెయిల్స్
మొదలగునవి పెరగడానికి సహాయపడుతుంది.

2. మొలకలను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆల్కైజెస్‌ను అందిస్తుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతక‌ వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో అసిడిటిని నివారిస్తాయి.

3. మొలకలు శరీరానికి అత్యవసరమైనటువంటి న్యూట్రీషియన్. ఇది మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని బాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతుంది. మానవ శరీరంలో జీవక్రియల్నీ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది.

4. మొలకలు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ జుట్టు పొడవుగా అందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది ఫ్రీరాడికల్స్ నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది పురుషుల్లో బట్టతల మరియు అలోపేసియా నివారిస్తుంది.

5. మొలకలు న్యూట్రీషియన్స్ క్యాపిల్లర్స్‌ను రిపేర్ చేస్తుంది మరియు బలాన్ని అందిస్తుంది. ఇంకా రక్తనాళాల్లో కొత్త రక్తకణాలు ఏర్పడేలా చేస్తుంది. దాంతో శరీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ మెరుగుపడుతుంది.

6. మొలకెత్తిని విత్తనాల్లో వివిధ రకాల విటమిన్స్ ఎ, బి కాంప్లెక్స్, సి, మరియు ఇ అధికంగా ఉన్నాయి. సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచే విటమిన్స్‌గా కొన్ని పరిశోధనలు చూపించబడినాయి. బీన్స్ మొలకల్లో 285 విటమిన్ బి1 పెరిగేలా చేస్తుంది.

7. మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో మెటబాలిజం రేటు పెంచుతుంది. శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

8. మొలకల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా ఉండవు. అందువల్ల మొలకలలో ఉండే న్యూట్రీషియన్స్ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com