బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే..
- July 03, 2019పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బెండకాయ కూరంటే చాలా ఇష్టం. పెళ్లి.. పేరంటాల్లో బెండకాయ ఫ్రై లేని విందు వుండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ బెండకాయలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా కడిగి చివరు, మొదలు కట్ చేసి తీసెయ్యాలి. బెండకాయలను నిలువుగా కట్ చేసి అవి మునిగేలా నీటిని పోయాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నేబెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఈ నీటిని తాగడం వలన మన పొట్టలోని పేగులు, జీర్ణాయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసిడిటి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గుతుంది. గుండె పని తీరు మెరుగుపరిచేందుకు కూడ ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్2 డయాబెటిస్ ఉన్న వారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానిక బెండకాయ నీరు పనిచేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్‌లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్‌లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్