పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..

- July 19, 2019 , by Maagulf
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..

ఎంప్లాయాస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించిన వడ్డీ రేటును తగ్గించాలన్న ఆర్ధక మంత్రిత్వ శాఖ సూచనను కార్మిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించిన ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటు యధాతంగా కొనసాగుతుంది. దీని ద్వారా 4.6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చేయడానికి గల కారణాలను విచారిస్తే.. కేంద్ర ఆధీనంలో ఉన్న ఇతర పొదుపు మొత్తాలపై ఇస్తున్న వడ్డీ కంటే ఈపీఎఫ్‌ఓ వడ్డీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగిలిన వాటికి ఇస్తున్నట్లుగానే వీరికి కూడా వడ్డీని తగ్గించి ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖను కోరింది. అయితే ఆర్థిక శాఖ సూచనలను పలు కార్మిక సంఘాలు తోసిపుచ్చాయి. వడ్డీరేటును తగ్గించవద్దంటూ కార్మిక శాఖకు వినతి పత్రాలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ సూచనను తోసిపుచ్చుతూ ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును యధాతథంగా కొనసాగిస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌ఓ వద్ద రూ.3,150 కోట్లు మిగులు నిధులు ఉన్నందున.. వడ్డీ రేటును తగ్గించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com