అమెరికా టూర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు అడుగడుగునా అవమానాలు

- July 22, 2019 , by Maagulf
అమెరికా టూర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు అడుగడుగునా అవమానాలు

అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఎయిర్ పోర్టులో అధికారిక స్వాగతం పలికేందుకు అమెరికా అధికారులెవరూ రాలేదు. కనీస ప్రొటోకాల్‌ ను కూడా పాటించలేదు. అమెరికాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మాత్రమే ఎయిర్ పోర్టుకు వచ్చారు. చివరికి ఆయనతో పాటే వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ అతడి ఇంట్లోనే బస చేయాల్సి వచ్చింది. US ప్రభుత్వం ఎలాంటి వాహనాలు కూడా సమకూర్చలేదు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి పాక్ అంబాసిడర్ ఇంటికి మెట్రోలో వెళ్లారు ఇమ్రాన్. ఈ ఘోర అవమానాలను తట్టుకుని ఆయన అమెరికా అధినేత ట్రంప్ ను కలవనున్నారు. అసలే పాక్ తీరుపై రుసరుసలాడుతోన్న ట్రంప్ ఎలా స్పందిస్తారో..!

ఈ పర్యటన కోసం శనివారమే అమెరికా చేరుకున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆయన టూర్ ని వ్యతిరేకిస్తూ యూఎస్ లోని పలుప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ లో MQM ప్రతినిధులు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు అమెరికాలోని పాక్ జాతీయులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ప్రసంగిస్తున్న సభలోనూ కలకలం రేగింది. బలూచిస్తాన్ మద్దతుదారులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com