చంద్రయాన్‌ 2 ని బాహుబలి తో పోల్చడంపై స్పందించిన హీరో ప్రభాస్

- July 23, 2019 , by Maagulf
చంద్రయాన్‌ 2 ని బాహుబలి తో పోల్చడంపై స్పందించిన హీరో ప్రభాస్

చంద్రయాన్‌ 2 ప్రయోగంతో ఇస్రో ఖ్యాతిని ప్రపంచం కొనియాడుతోంది. ప్రధానంగా సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సగటు భారతీయుడు గర్వించాల్సిన తరుణమన్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలివుడ్‌ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ట్వీట్లతో….ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రో చరిత్ర సృష్టించిందన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రోను పొగుడుతూ జై హింద్‌ అంటూ ట్వీట్‌ చేశారాయన. హీరో నాగార్జున సైతం.. చంద్రయాన్‌ -2ను విజయవంతంగా ప్రవేశపెట్టింనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ మరో ఘనత సాధించిందంటూ ట్వీట్‌ చేశారు. నటుడు ప్రభాస్‌ సైతం… చంద్రయాన్‌-2 సక్సెస్‌పై ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు భారతీయులుగా మనం ఎంతో గర్వపడాలంటూ ట్విట్‌ చేశారు. ఈ ఉపగ్రహాన్ని బాహుబలి తో పోల్చడాన్ని తమ ‘బాహుబలి’ చిత్ర బృందం గౌరవంగా భావిస్తోందన్నారు. మోర్‌ పవర్‌ టు ఇండియా అంటూ ట్వీట్‌ చేశారు ప్రభాస్‌. హీరో మంచు విష్ణు సైతం చంద్రయాన్‌ -2 సక్సెస్‌పై స్పందించారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం తనను ఎంతో ఉత్కంఠకు గురి చేసిందంటూ ట్వీట్‌ చేసారు మంచు విష్ణు.

అటు ప్రముఖ హీరోయిన్‌లు సైతం…చంద్రయాన్‌ సక్సెస్‌పై స్పందించారు. ఇది గర్వించాల్సిన సమయమని తాప్సీ ట్వీట్‌ చేయగా.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం మంటూ యామీ గౌతమ్‌ ట్విట్‌ చేశారు. ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రోకు ఆల్ ది బెస్ట్‌ చెప్పారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌.
సీనీ రచయిత రామజోగయ్య శాస్త్రి సైతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మస్థైర్యం దేన్నైనా సాధ్యం చేస్తుందన్నారాయన. చంద్రయాన్‌ 2పై నటుడు మాధవన్‌ సైతం స్పందించారు. ఇస్రో విజయం చాలా చాలా గర్వంగా ఉందన్నారు. ఇది అద్భుతమైన ప్రారంభమని.. చాలా సంతోషంగా ఉందన్నారాయన. నటి ఖుష్బూ సైతం చంద్రయాన్‌ 2 సక్సెస్‌పై స్పందించారు. జైహింద్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక బాలీవుడ్‌ సైతం… చంద్రయాన్‌ 2 ప్రయోగంపై స్పందించింది. హీరో అక్షయ్‌ కుమార్ ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిందంటూ ట్వీట్‌ చేశారు. చంద్రయాన్‌-2 విజయం వెనుక ఉన్న బృందానికి సెల్యూట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నటుడు షారుక్‌ ఖాన్‌ సైతం స్పందించారు. చంద్రయాన్‌-2 ప్రయోగం చాలా శ్రమతో కూడుకున్నదంటూ ట్వీట్‌ చేశారు. నమ్మకంతో దాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరణ్‌ జోహార్‌ కూడా స్పందించారు. చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించే అవకాశం వచ్చినందుకు మనమంతా అదృష్టవంతులం అంటూ ట్వీట్‌ చేశారు. ఇద్దరు మహిళల సారధ్యంలో ఇస్రో నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహమన్న ఆయన.. మహిళలు ప్రపంచాన్ని ఏలుతున్నారన్నారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com