చంద్రయాన్ 2 చంద్రుడి మీద దిగడం.. మోదీతో కలిసి ప్రత్యక్షంగా చూసే అవకాశం..

- August 10, 2019 , by Maagulf
చంద్రయాన్ 2 చంద్రుడి మీద దిగడం.. మోదీతో కలిసి ప్రత్యక్షంగా చూసే అవకాశం..

చంద్రయాన్2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం విద్యార్థులకు కలిపిస్తోంది ఇస్రో. ఎనిమిది నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నెల 10 నుంచి ‘ఇస్రో మై గవ్’ అనే వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో అవసరమైతే ఆన్సర్లలో సహాయపడవచ్చు కానీ పూర్తిగా వారే చేయకూడదు. 10 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒకసారి మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. వేగంగా స్పందించే మనస్థత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. విజేతలు ఎక్కువగా ఉంటే ప్రశ్నలకు సమాధానాలు వేగంగా ఇచ్చే వారిని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికీ ప్రశంసాపత్రం అందిస్తారు. చంద్రయాన్ 2 చంద్రుడి మీదకు దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించడానికి బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. విజేతలైన విద్యార్థులు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com