అమెరికాలో ప్రభుత్వ పథకాలు వాడుకుంటే గ్రీన్‌కార్డు బంద్‌!

- August 13, 2019 , by Maagulf
అమెరికాలో ప్రభుత్వ పథకాలు వాడుకుంటే గ్రీన్‌కార్డు బంద్‌!

వలసల విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్న అమెరికా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వలసదారులకు గ్రీన్‌కార్డును నిరాకరిస్తామని పేర్కొంది. అమెరికా పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వినియోగించుకోబోమని వలసదారులు కాన్సులర్‌ ఆఫీసర్‌కు నమ్మకం కలిగించాలి. అలా చేయని పక్షంలో చట్టబద్దమైన శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్‌కార్డును జారీచేయడం జరుగదు. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లపై పబ్లిక్‌ చార్జ్‌ (గ్రీన్‌కార్డు, వీసా తదితర పత్రాల రద్దు) విధించబడుతుందని అని శ్వేత సౌధం పేర్కొంది. బయటి దేశం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా, సొంత ఆదాయంపై జీవించేలా ఈ నిర్ణయం సాయపడుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com