సౌదీ జైలులో హక్కుల కార్యకర్తలకు చిత్ర హింసలు

- August 16, 2019 , by Maagulf
సౌదీ జైలులో హక్కుల కార్యకర్తలకు చిత్ర హింసలు

రియాద్‌: సౌదీ అరేబియా లోని జైలుల్లో మగ్గుతున్న హక్కుల కార్యకర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమ కార్యకర్త లౌజాన్‌ అల్‌ హత్లౌల్‌ ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. ఆమె కూడా జైలులో చిత్ర హింసలకు గురయ్యారు. ఎవ్వరైనా విడుదల కోసం అభ్యర్థిస్తే తమపై ఎటువంటి చిత్రహింసలు, లేదా దాడి జరగలేదని వాగ్మూలమివ్వాలంటూ అధికారులు షరతులు పెడుతున్నారని లౌజాన్‌ తెలిపారు. జైలులో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా ఎటువంటి చిత్రహింసలు జరగలేదని వాగ్మూలమిస్తేనే బెయిల్‌ ఇస్తామని తమపై ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఈ షరతుల ఒప్పందాన్ని తాను తిరస్కరించానన్నారు. లౌజాన్‌ వీడియో ఇప్పుడు సౌదీలో భారీ నిరసన ప్రదర్శనలకు దారితీస్తోంది. మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న హత్లౌల్‌ తదితర కార్యకర్తలను, ఆమె కుటుంబ సభ్యులను 2018 మే నెలలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com