ఇండియన్ హెల్త్ కేర్ వెబ్‌సైట్ హ్యాక్!

- August 22, 2019 , by Maagulf
ఇండియన్ హెల్త్ కేర్ వెబ్‌సైట్ హ్యాక్!

డార్క్ వెబ్.. హ్యాకర్లకు పుట్టినిల్లు.. ఎప్పుడు ఏ వెబ్‌సైట్ హ్యాక్ చేస్తారో గుర్తించడం కష్టమే. ఎలాంటి పెద్ద సైట్లు అయినా సరే.. హ్యాకింగ్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు. అత్యంత సెక్యూరిటీ కలిగిన వెబ్ సైట్లను కూడా హ్యాకర్లు మాల్ కేర్ కోడింగ్‌తో డీకోడ్ చేసి హ్యాక్ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆన్‌లైన్ ఎంతవరకు సేఫ్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం కష్టమే. హ్యాకర్ల బారిన పడకుండా ఎప్పటికప్పడూ సెక్యూరిటీ పరంగా ప్రీకాషన్స్ తీసుకోవడం ఒక్కటే మార్గం.

ఇప్పటికే ఎన్నో వెబ్ సైట్లు హ్యాకర్ల దాడికి గురయ్యాయి. ఇటీవల భారత్‌కు చెందిన హెల్త్ కేర్ వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు హెల్త్ కేర్ వెబ్ సైట్లోకి చొరబడి 68 లక్షల రికార్డులను దొంగిలించినట్టు యూఎస్ బేసిడ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ FireEye ఒక ప్రకటనలో వెల్లడించింది. హెల్త్ కేర్ సైటులో పొందుపరిచిన రోగులు, డాక్టర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్టు గుర్తించింది. ఆ సైట్ పేరు చెప్పేందుకు సైబర్ సంస్థ నిరాకరించింది.

చైనాకు చెందిన సైబర్ క్రిమినల్స్.. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ వెబ్ పోర్టల్ డేటాను నేరుగా ఆన్‌లైన్‌ బ్లాక్ మార్కెట్ (డార్క్ వెబ్) ద్వారా అమ్మేస్తున్నట్టు ఫైర్‌ఐ పేర్కొంది. ఫిబ్రవరిలో fallensky519 అనే పేరుతో భారత ఆధారిత హెల్త్ కేర్ వెబ్ సైట్ నుంచి 68లక్షల రికార్డులను హ్యాకర్లు దొంగలించారు. అందులో రోగుల సమాచారం(PII)తో పాటు వైద్యుల సమాచారం, PII, క్రెడిన్షియల్స్ హ్యాక్ చేసినట్టు FireEye రిపోర్టును షేర్ చేసింది. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఫైర్ ఐ థ్రెట్ ఇంటెలిజెన్స్ హ్యాకర్ల ప్రతి మూవెంట్ గమనిస్తూ వస్తోంది. బహుళ హెల్త్ కేర్ అనుబంధ డేటాబేస్ మొత్తం బ్లాక్ మార్కెట్ ఫారమ్స్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించింది. చాలావరకు 2వేల డాలర్ల వరకు సేల్ చేస్తున్నట్టు తెలిపింది.

కేన్సర్ రోగాలు, మరణాల రేట్లు పెరిగిపోవడం నేషనల్ హెల్త్ కేర్ ఖర్చులు భారీగా పెరగడం చైనాలో ఆందోళనకు గురిచేస్తోందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ నివేదించింది. దశాబ్దకాలంలో కేన్సర్ మరణాల రేటు క్రమంగా పెరిగిపోతున్నాయని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. చైనాలో మరణాల రేటు పెరగడానికి కేన్సర్ కారణమని నివేదికలు 2019 ఏప్రిల్ ప్రారంభంలో, చైనా సైబర్ గూఢచారులు క్యాన్సర్ రీసెర్చ్‌పై "EVILNUGGET" మాల్ వేర్‌తో యుఎస్ ఆధారిత ఆరోగ్య కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు నివేదికలు హెచ్చరించాయి.

అదే నెలలో, చైనా ప్రభుత్వం తరపున మెడికల్ రీసెర్చ్ రికార్డులను హ్యాక్ చేశారనే ఆందోళనల నేపథ్యంలో ఎండి అండర్సన్ క్యాన్సర్ పరిశోధనలో పలువురు పరిశోధకులను తొలగించారు. చైనీస్ సైబర్ గూఢచారులు ఆరోగ్య సంరక్షణ రంగంలో (పిఐఐ), రక్షిత ఆరోగ్య సమాచారం (పిహెచ్‌ఐ) లక్ష్యంగా చేసుకున్నట్టు ఫైర్‌ఐ గుర్తించింది.

చైనీస్-నెక్సస్ గ్రూపులతో పాటు రష్యా-నెక్సస్ APT28 గ్రూపు సహా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడంలో సైబర్ నేరగాళ్ల ప్రమేయం ఉన్నట్టు ఫైర్ ఐ ఇంటెలిజెన్స్ గమనించింది. అంతేకాదు.. బయోమెడికల్ పరికరాల వాడకం పెరిగేకొద్దీ విఘాతం కలిగించే లేదా విధ్వంసక సైబర్ దాడులే లక్ష్యంగా మారే అవకాశం ఉందని సైబర్ సంస్థ రిపోర్టు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com