సౌదీ అరేబియా ప్రైవేటు రంగంలో ప్రవాసుల కోసం 'తక్షణ వీసా'

- August 23, 2019 , by Maagulf
సౌదీ అరేబియా ప్రైవేటు రంగంలో ప్రవాసుల కోసం 'తక్షణ వీసా'

సౌదీ అరేబియా: వలసదారులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వలసదారుల కోసం తక్షణ కార్మిక వీసా సర్వీస్‌ను సోమవారం ప్రారంభించింది. కివా ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా ఈ సేవను కార్మికులు పొందవచ్చు. ప్రైవేట్ రంగ సంస్థలను దృష్టిలో పెట్టుకొని తక్షణ కార్మిక వీసా సర్వీస్‌ను తీసుకొచ్చింది. వర్క్ వీసా కోసం సాధారణంగా 8 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా తాజాగా తెచ్చిన ఈ సర్వీస్‌తో వెంటనే వీసా పొందే సౌకర్యం కల్పించింది సౌదీ కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ. కాగా, ఈ సర్వీస్‌ను అన్నీ ప్రైవేట్ సంస్థలకు కాకుండా ఏవైతే సౌదీ అభివృద్ధిలో అధిక శాతం పాలు పంచుకోవడంతో పాటు మంత్రిత్వ శాఖ నిబంధనలను పూర్తిగా పాటించడం జరుగుతుందో వాటికే మాత్రమే వర్తింపచేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల ప్రకటించిన సౌదీ నేషనలైజేషన్ స్కీమ్ ప్రకారం ప్రధానంగా సౌదీలో నిరుద్యోగాన్ని తగ్గించడం.. అలాగే సౌదీ కంపెనీలు మరియు సంస్థలు తమ శ్రామిక శక్తిని సౌదీ జాతీయులతో కొన్ని స్థాయిల వరకు నింపాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు చాలా ప్రైవేట్ సంస్థలు భారీ సంఖ్యలో వలస కార్మికులను నియమించుకోవడం వల్ల సౌదీ జాతీయుల్లో నిరుద్యోగితకు కారణమైంది. పాకిస్థాన్, ఇండియా, ఫిలిప్పైన్స్‌, లెబనాన్, ఈజిప్ట్ దేశాల నుంచి వచ్చే వలసదారులకు సౌదీ కంపెనీలు భారీ మొత్తంలో ఉద్యోగాలు కల్పించేవి. దీంతో సొంత దేశీయులకు ఉద్యోగాలు దొరకకపోవడంతో నిరుద్యోగిత పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సౌదీ జాతీయులకు అసలు పని దొరకకుండా పోతుందని భావించిన అక్కడి ప్రభుత్వం సౌదీ నేషనలైజేషన్ స్కీమ్(సౌదీజేషన్)ను ప్రకటించింది. దీని ప్రకారం సౌదీ కంపెనీలు మరియు సంస్థలు తమ శ్రామిక శక్తిని సౌదీ జాతీయులతో కొన్ని స్థాయిల వరకు నింపాల్సి ఉంటుంది. సౌదీజేషన్‌ను పాటించే ప్రైవేట్ కంపెనీలకు తాజాగా తీసుకొచ్చిన తక్షణ కార్మిక వీసా సర్వీస్‌ను అమలు చేస్తామని కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అర్హతగల యజమానులు ఇప్పుడు క్వివా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా సేవ కోసం నమోదు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com