అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరలేదు: అమెరికా అధికారి

- August 24, 2019 , by Maagulf
అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరలేదు: అమెరికా అధికారి

న్యూయార్క్ : కశ్మీర్ అంశంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరలేదని అగ్రరాజ్యం ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మరో సారి స్పష్టం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తనను మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ సర్కార్‌కు చెందిన ఈ అధికారి కామెంట్స్ చర్చనీయాంశమైయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఇటు ప్రధాని మోడీకి అటు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మంచి మిత్రుడని అయితే వారిలో మధ్యవర్తిత్వం వహించాలని ఎవరు కోరినా అందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ఇక కశ్మీర్ విషయం భారత అంతర్గత విషయం అని అధికారి స్పష్టం చేశారు.

కశ్మీర్ అంశం పూర్తిగా అంతర్గతమైన విషయం అని అయితే ఆ ప్రాంతంలో శాంతిని ఎలా నెలకొల్పుతారో అనేదానిపై ట్రంప్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగకుండా మోడీ తీసుకుంటున్న చర్యలు భేష్ అని అధికారి కొనియాడారు. జీ-7 సమావేశాల్లో భారత్ పాకిస్తాన్‌ల అంశం చర్చకు వస్తుందనే తాను అనుకుంటున్నట్లు చెప్పారు. కశ్మీర్ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం అని అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారని అయితే ఇద్దరి మధ్య సఖ్యత లేదని ట్రంప్ గతవారం వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే జరుగుతోందని చెప్పారు.

ఇక కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో తలెత్తుతున్న విబేధాలు 1972 సిమ్లా ఒప్పందం ఆధారంగా ఉంటాయని ఇందులో థర్డ్ పార్టీ జోక్యం అనవసరం అని భారత్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే జీ7 సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా భారత్‌కు ఆ దేశాలు ఆహ్వానం పలికాయి. ఇదిలా ఉంటే కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రంప్ మోడీని కోరే అవకాశం ఉంది. అంతేకాదు కశ్మీర్‌లో పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేయాలని ట్రంప్ కోరే ఛాన్స్ ఉంది. ఇక సరిహద్దుల్లో ఉగ్రవాదంను అంతమొందించాలని పాకిస్తాన్‌కు ట్రంప్ సూచించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com