తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కీలక చర్చ

- September 15, 2019 , by Maagulf
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కీలక చర్చ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కీలక చర్చ జరుగుతోంది. ఆదివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగానే బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ఇందుకు స్వయంగా సీఎం కేసీఆరే సమాధానాలిచ్చారు. దేశంపై ఆర్ధికమాద్యం ప్రభావం విస్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎందరో ఆర్థిక నిపుణులు, ప్రముఖులు మాద్యంపై వ్యాసాలు రాస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. దేశ ఆర్థికవ్యవస్థపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ‘ఆర్థిక మాంద్యంతో మూడేళ్లదాకా తేరుకోలేమని రతన్‌ టాటా, ఆనంద్‌ మహీంద్రా లాంటివారు చెబుతున్నారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపొందించాం. అభివృద్ధిని అడ్డుకునేందుకే కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆర్ధికమాద్యం ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రస్తుతం కేంద్రంలో 5శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదైంది. గడిచిన ఐదేళ్లలో 21 శాతం వృద్ధిరేటు సాధించాం. ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా రంగాలపై ఉంది.. మేము కూడా అందుకు తగ్గట్లు సిద్ధమయ్యాం. ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. మూడేళ్ల వరకూ కోలుకోలేదని నిపుణులు ఇప్పటికే చెప్పారు. అన్నింటినీ అంచనా వేసే బడ్జెట్ రూపొందించాం’ అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com