చరిత్ర

- February 13, 2016 , by Maagulf



మాట నేర్చిన మట్టి బెడ్డలు 
ఒక్కో పాట పాడుతుంటయ్ 

ఆకలేమిటో తెలియకుండా 
సరిహద్దులు అలుగుతుంటయ్

దుస్తులు కప్పుకున్న దేహాలు 
కత్తులు దాచుకుంటయ్ 
ఇక మిగిలేదేముంటది మరక తప్ప

రక్తం  ఓ రంగు చుక్క 
చరిత్రను రాసుకుంటూ పోతుంటది


పారువెల్ల(దుబాయ్)
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com