పుస్తక విలాపం

- April 01, 2016 , by Maagulf

గత రెండు దశాబ్దాలలో,  సాహిత్య రంగం లో ముఖ్యంగా  ఇంటర్నెట్  ప్రపంచం లో ఎన్నో మార్పులు చేర్పులు.. తద్వార... పుస్తకాలు, వార్తా పత్రికలూ చదవడం తగ్గించి, ( ప్రస్తుత జనరేషన్ వారైతే  పూర్తిగా  మానేసి అని కూడా అనుకొవచ్ఛు ) , స్మార్ట్ ఫోన్ ప్రపంచం లోనే  పరిమితులయ్యారని  అనుకోవడం లో ఏ మాత్రం  అతిశయోక్తి లెదు. .     కేవలం ఈ మెయిల్స్ ద్వారా సమాచారాన్ని అందించుకునే స్థాయి లో వుండే మనం.. క్రమేపి ఇంటర్నెట్ లో ముందుగా యాహూ మెసెంజర్ ద్వారా తర్వాతా  గూగుల్ ద్వారా చాట్టింగ్ చేసే స్థాయికి చేరుకున్నాం.. పేస్ బుక్ , ట్విట్టర్, వాట్సాప్ ల శతాబ్దం లో అడుగు పెట్టి స్మార్ట్  ఫోనుల ప్రభంజనం తో మరింత ముందడుగేసి.. వైర్లెస్ నెట్ వర్కుల విస్ఫోటనం తో  ప్రపంచం లో ఎక్కడున్నా ఒకరినొకరు చూస్తూ పలకరించుకునే స్థాయికి ఎదగడమే కాకుండా  గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో నిక్షిప్తమయివున్న అపారమయిన జ్ఞాన/ అజ్ఞాన సంపదలకి దాసోహమయ్యి  మెదడు కి పని చెప్పడం మానేసాం.. ఫలితం.. పదాలు కుదించడమే కాక  మస్తిష్కాలని కూడా  కుదించేయడానికి  అలవాటు పడ్డాం..  నిజానికి వరల్డ్ వైడ్ వెబ్బు తో పాటు జన్మించిన జనరేషన్  పుస్తకాల కి దూరం గా టెక్స్ట్ మెసేజ్ ల కి దగ్గరగా పెరగడం తో  సమాజం లో సాహితీ విలువలు కొద్దిగా క్షీణింప సాగాయి. నిజానికి  పాత జన రేషన్ల కి  అందు బాటు లో లేని ఎన్నో విషయాలు, కావ్యాలు, గంధాలు, పురాణాలు, ఇతిహాసాలు.. ప్రస్తుత జన రేషన్ కి ఒక మౌస్ క్లిక్ దూరం లోను, ఒక స్మార్ట్ ఫోన్ కీ చేరువ లోను  లభ్యమవుతున్నాయి.. కాని  ప్రపంచం లో బహు ప్రముఖమైన పుస్తకాలు గాని, అవి రచించిన రచయితలు కాని  ప్రస్తుత  టీనేజర్ ల లో చాలా తక్కువ శాతానికి మాత్రమే తెలుసు. కారణం.. స్పెల్లింగ్ లు రాక మునుపే  స్మార్ట్ ఫోన్లు చేతికి అందడం... పుస్తక పఠనం లో వున్న ఆనందం అనుభవించక ముందే  సెర్చ్ ఇంజిన్ ల మీద ఆధార పడ్డం అలవాటు కావడం తోను.. వారి తల్లి తండ్రులు యాంత్రిక యుగం లో ఎల్లప్పుడూ  ఉరుకులు పరుగులు మీద కాలం గడుపుతూ  వెకేషన్ పేరుల తో.. వీకెండ్ ఆక్టివిటీస్ తో ను పిల్లలణి ఏమారుస్తూ... గారాబిస్తూ..  పుస్తకం కన్నా గొప్ప స్నేహితుడు ఉండడన్న విషయాన్ని గుర్తు చెయ్యక పోవడం తో నేమ్ లెస్ , పేస్ లెస్ మిత్రుల పరిచయ ప్రభావం లో పడి.. బుక్కంటే.. ఫేస్బుక్ మాత్రమే అనుకునే యుగం లోకి ముందుకు పోతున్న ప్రస్తుత నెక్స్ట్ జెన్ గా పిలవ బడే వాళ్ళు అసలు లైబ్రరి ల జోలికే వెళ్ళకుండా  అక్కడ వుండే సాహిత్య ఖజానా లో దొరికే సాహిత్య సంపదని అక్కడే బంది ఖానా లో ఉంచినట్టు గా ఆ బాధని తట్టుకోలేక  ఆకస్మికం గా అక్కడ ప్రత్యక్షమయిన ఒక వ్యక్తి ణి చూస్తే ఆ పుస్తకాలు తమ వేదన ణి ఎలా వెళ్ళ బుచ్చుకుంటాయన్న ఊహ తో... కరుణశ్రీ  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించగా .    ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఆలపించిన పుష్ప విలాపము  స్ఫూర్తి తో  ఆ పుస్తకాల వేదన ని  పుస్తక విలాపం అనే కవిత లో వర్ణించ బడింది.   కరుణశ్రీ గారికి, ఘంటసాల గారికి ధన్యవాదాలు మరియూ క్షమాపణలు కూడా కోరుకుంటూ.. 

 

పుస్తక విలాపము.

 

 

నా స్మార్ట్ ఫోన్  చార్జ్ అయిపోయి..  ఏం చెయ్యాలో  తోచక...

పక్కనే వున్న ఒక లైబ్రరీ కి వెళ్ళాను ప్రభూ...

చాట్ చేసే వాళ్ళెక్కువై ... చదివే వాళ్ళు తక్కువై...

గ్రంధాలయం విలవిల్లాడుతోంది... కావ్య మాతలు కృశించి  కొన ఊపిరి  తో  కొట్టు మిట్టాడుతున్నాయి... 

అప్పుడు..

 

నేనొక మూల బుక్కుకడ నిల్చి... తటాలున..  కవరు తెరిచి....

చదవాలనుకున్నంత లోన... పుస్తకమ్ములన్నియు... జాలిగా.. నోళ్ళు  విప్పి..  

మాకూ.. ప్రాణము పోయవా...... యనుచు.. బావురు మన్నవి  కృంగి పోతూ.....

 

నా మానసమందేదో.... కలుక్కుమన్నది పుస్తక విలాప కావ్యమై...ఆ.... ఆ... ఆ... ఆ...

 

అంతలో చిన్నయ సూరి  అనువదించిన పంచతంత్రము నన్ను చూసి ఇలా అంది ప్రభూ...

ఆయువు కల్గు అనంత కాలము... వినిపించిన నన్ను మీరు కన్నబిడ్డలకు  కథల రూపమున.....

మదీయ కరమ్ముల లోన స్వేచ్చగా ఊయలలూగుతున్  మురియుచుందుము... పిల్లలు నిదురించినంతనే... హాయిగ  పవళించెదము పాపల పసిడి గుండెలపై... ఆ... ఆ... ఆ... ఆ...

 

ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనాన్ని అల్మారాల్లో... బంధిస్తావ్?

మేం మీకేం అపకారం చేసాం...

 

జ్ఞానము పెంపు జేసెదము ఈ గ్రంధముల తోటి...

సమాశ్రయించు  బృందాలకు... విందు చేసదము కమ్మని కవితలూ....

మము జేరు నేత్రాలకు హాయి కూర్చెదము... సంపన్నుల మమ్ముల మంద బుద్ధి తో.. 

మూలలో  పార దోయకుము...

ట్విట్టరు...  వాట్సాప్.... పేస్ బుక్కుతో.... ఓ... ఓ.... ఓ... ఓ...

 

ఇంతలో పోతనామాత్యుడి భాగవతం.. బాధతో ముఖమంతా ముడతపడి... ఇలా అంది ప్రభూ...

అంతరంగాలలో.. ఊహ పరితపించి... కలములో నుంచి పదములు చేర్చి, కూర్చి... వ్రాసుకొందురు కదా ముచ్చటగ కవులు మమ్ము.....  

అకటా ... దయలేని వారు మీ యంగ్ రీడర్స్....

పాపం.. మీరు ఆధునిక యుగములో నున్న జనరేషన్ కాబోలునే....  

 

మా వెల లేని ముగ్ధ సుకుమార ప్రబంధ, ప్రభోధ, మాధురీ కావ్యములెల్ల...

మీకై రచించి, చరించి, తరించి పోయిన ఈ సాహితీ వేత్తలు చెల్లరని... 

ఆపై మోడరన్ ముసుగులు కమ్మి మమ్మస్సలు లెక్క చేయరు కదా.. మీ జాతికి జాలి వున్నదా...

 

ఓయి.. నాగరికుడా... వ్యాస దేవుని భూమి లోన పుట్టినావు..

సహజమగు సాహిత్యము నీలోన చచ్చెనేమి...

జ్ఞాన సంపదను త్రోసిపుచ్చెడి మూర్ఖులుండ మూలపడి పోయేనోయి... నా ఈ బుక్కు జన్మ...

ఆ... ఆ... ఆ... ఆ...

 

అని దూషించు కావ్య కన్నియలను వదల లేక... ఛార్జ్ లేకుండా ఉంచిన నా స్మార్ట్ ఫోన్ ప్రసారాల్ని 

తగ్గించి... పుస్తక ప్రపంచాన్ని చెంత చేర్చుకునే వివేక లేఖల్ని ప్రసాదించు ప్రభూ....

 

ప్రభూ.....  ఊ.... ఊ... ఊ...

 

 

   ఈ కవిత పుష్ప విలాప బాణీ  లో నా గాత్రం తో వున్న వీడియో  ఈ లింక్ లో వినవచ్చు 

 

https://www.youtube.com/watch?v=Bb6AtLD4CE4

 

--జీడిగుంట విజయ సారధి(యక్సెంచుర్,సీనియర్ మేనేజర్,యు.యస్.ఏ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com