అమ్మ- నాన్న (షార్ట్ స్టోరీ)

- April 01, 2016 , by Maagulf

పార్క్ లో చుట్టూ చెట్లు మధ్యలో ఒక బెంచ్ మీద ఒక అరవై ఏళ్ళ పెద్దాయన మొబైల్ పట్టుకొని తన భార్యకు చూపిస్తూ ఉన్నాడు…. పక్క బెంచ్ లో ఒక అమ్మాయి కూర్చుని మొబైల్ చూస్తూ పాటలు వింటోంది ఇంతలో ఒక ఇరవై ఏడేళ్ళ అబ్బాయి ఫోన్ లో మాట్లాడుతూ అటుగా వచ్చాడు

“సరే అమ్మ తింటా లే రోజు ఎందుకు తిను తిను అని తల తింటావు నాకు తెలుసు కదా ఎంత తినాలి ఎప్పుడు తినాలి అని నేను ఏమైనా చిన్న పిల్లాడిన ఇలా రోజు నువ్వు చెప్తున్నావు అని తిని తిని పది కేజీలు పెరిగాను ముందు నువ్వు రోజు మందులు కరెక్ట్ గా వేసుకో.. నాన్న ని సిగరేట్ ఎక్కువ తాగనివ్వద్దు సరే ఉంటా ”

అటు పక్క వాళ్ళ అమ్మ మాట్లాడుతుండ గానే కట్ చేసాడు పక్క బెంచ్ లో అమ్మాయి పక్కన వచ్చి కూర్చున్నాడు …

“ఏంటి అమ్మనా ఎందుకు అంత విసుక్కుంటావు తనను ?? నీ హెల్త్ గురించే కదా చెప్తోంది”

“చెప్పింది లే అయిన ఫోన్ చెసినప్పుడంత రోజు అదేనా చెప్పడం నేను తింటాను కదా నాకు తెలిద ఎంటో వాళ్ళ చాదస్తం నాకు అర్థం కాదు “

“కొవ్వు కదా వాళ్ళ అంత ప్రేమతో చెప్తుంటే బండోడ ... "

"బండోడ అంటే నేను వెళ్ళిపోతా"

"లేదు లే రా స్వామి కృష్ణ కిట్టయ్య బంగారు కొండ బుజ్జి కన్నా  ... రా కూర్చో వాళ్ళ ప్రేమ వాళ్ళది నీ పిచ్చి నీది అయిన నా గురించి చెప్పొచ్చు కదా రాధా ఉంది నేను తినేదాక వదిలిపెట్టదు అని”

“నీ మొహం లే నువ్వే కాల్ చేసి చెప్పు అమ్మ కి అయిన నువ్వు ఇలా తినిపించ బట్టే కదా పది కేజీలు  పెరిగి భండొడి లాగ తయారయ్యాను ముందు నిన్ను తన్నాలి”

“అరె తన్నడం దాకా దేనికి బిడ్డ  గది పక్కన బెట్టి ముందు నన్ను పట్టుకో చాలు ఆటోమేటిక్ గా తగ్గిపోతావు”

“తల్లి నువ్వు రన్నింగ్ ఛాంపియన్ నీతో పరిగెత్తడం నా వాళ్ళ కాదు నన్ను వదిలిపెట్టు నా తంటాలేవో  నేను పడతా”

“పెళ్లి లోపల తగ్గక పోతే నేనే కోసి తీసేస్త కొవ్వు”

ఈ మాటలు వింటున్న ఆ భార్య భర్తలు నవ్వేసారు అమ్మాయి అబ్బాయి సిగ్గు పడుతూ వాళ్ళను చూస్తారు…

“ఏంటి బాబు పెళ్లి చేస్కోబోతున్నర ??”

“అవును అంకుల్”

“కంగ్రాట్స్ బాబు … హ్యాపీ మ్యారీడ్ లైఫ్”

“థాంక్స్ అంకుల్ … “ చేతిలో ఉన్న మొబైల్ వంక చూసి

“వావ్ ఐ ఫోన్ చాల బాగుంది సూపర్ అంకుల్  ??”

“థాంక్స్ బాబు ఐ ఫోన్ 6s అంట నిన్ననే యాబై వేలు పెట్టి కొన్నాను “

“వామ్మో అంత నా అయిన మీకు ఇవన్ని ఎందుకు అంకుల్ పైకి పోయే వయసులో .. ఏదైనా 1100 పెట్టుకుంటే సరిపోతుంది మా కర్మ చుడండి మేము నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాము ” అని హేళన చేస్తూ అన్నాడు

“రేయ్ ఎదవ” అని మొట్టికాయ కొట్టింది రాధా

“సారీ అంకుల్”

“ఇంగ్లీష్ బాష మనకు నేర్పిన అతి దౌర్బగ్యపు పదం ఇది.. కాని సారీ ప్రతి ఒక దాన్ని సరి చేయలేదు“ సిగ్గు తో తల దించుకున్నాడు …

“నీకు ఈ ఫోన్ వాడటం వచ్చా బాబు “

“హా తెలుసు అంకుల్”

“నాకు ఇందులో ఒక ఫేస్బుక్ ఎకౌంటు ఓపెన్ చేస్తావ బాబు “

“సరే అంకుల్ ఇటు ఇవ్వండి”

“ఫేస్బుక్ ఎకౌంటు ఓపెన్ చేసేకి మీ పేరు కావలి చెప్పండి”

“నా పేరు వద్దు లే బాబు ఏదైనా వేరే పేరు తో పెట్టండి”

“ఏ పేరు మీద పెట్టమంటారు ??”

“ మీ పేర్లు ఏంటి ??” “

“నా పేరు రాధా వీడి పేరు కృష్ణ”

“అయితే రాధా కృష్ణ అని పెట్టు బాబు …”

“నా పేరు ఎందుకు అది ఫేక్ ఐడి కి.. రేపు ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఇరుక్కుంట”

రాధా కృష్ణ చెవులు పిండుతూ “కిట్టి బాబు బుజ్జి బంగారం ప్రపంచం లో నువ్వు ఒకటే కృష్ణ నేను ఒకటే రాధా లేరు చాల మంది ఉన్నారు నువ్వు మరి ఎక్కువ అలోచించి సత్య హరిశ్చంద్ర లెవెల్ లో బిల్డ్ అప్ కొట్టకు మూసుకొని అంకుల్ చెప్పింది చేయి... ఏంజెల్ అని పేరు పెట్టుకున్న అమ్మాయి తో చొంగ కార్చుతూ చాట్ చేయలేదా ఫేక్ ఐడి కి పాతిక వేలు ఇచ్చి దొబ్బించుకోలేదా బంగారు కొండ ??”

“అందుకే ఇది అదే బాపుతూ అని బయపడ్డాను " నోరు మూసుకొని పని కాని అని సైగ చేసింది రాధ

"సరే  లే  రాధా కృష్ణ, జెండర్ మేల్”

“మేల్ వద్దు బాబు ఫిమేల్ అని పెట్టు”

" చూసావా చూసావా చెప్పాన ఫేక్ ఎకౌంటు అని నా లాంటి అబ్బాయిలను మోసం చేయడానికే నేను ఓపెన్ చేయను”

అంకుల్ చిన్నగా నవ్వుతు …

“ఒరేయ్ పిచ్చోడా అవన్నీ నీకెందుకు నువ్వు చేస్తావ నన్ను చేయమంటావ ఇటు ఇవ్వు మొబైల్  చేంతాడంత నోరేస్కోని మాట్లాడటం కాదు కొంచం బుర్ర వాడు నాకెందుకో అంకుల్ చేసేదాంట్లో తప్పు లేదు ఏదో పర్పస్ ఉంది అనిపిస్తోంది నువ్వు మూసుకొని ఓపెన్ చేయి”

“సరే లే జెండర్ ఫిమేల్ నీ సపోర్ట్ ఒకటి… రేపు ఇలాంటి ఫేక్ ఐడి వాళ్ళ మోసం పోయాము అని ఎంత మంది అబ్బాయిలు బయటకు వస్తారో ... ఆ చండాలమైన పనిని నా చేత చేపిస్తున్నావు... అంకుల్ ఫోటో ఒకటి పెట్టాలి ఏది పెట్టమంటారు …”

“రాధాకృష్ణ అని ఉంది కదా బాబు ఆ దేవుడి ఫోటో నే పెట్టు … “

“ఇది కూడా ఎందుకు ఏదైనా అమ్మాయి ఫోటో పెట్టుకోవాల్సింది కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు  మెసేజ్ లు లైక్ లు కామెంట్ లు వచ్చేవి ..…”

“బాబు ఇప్పుడు ఇందులో వంశీ కృష్ణ అనే పేరు వెతుకుతావ ?? “

“ఇప్పుడే ఐడి క్రియేట్ చేసారు అప్పుడే అబ్బాయిలను ఆడ్ చేసుకుంటున్నారు చూడు నేను చెప్తే విన్నావు కాదు పక్క 420 బ్యాచ్ పద లేచి వెళ్ళిపోదాం“ అని మొబైల్ చేతికి ఇచ్చి

“రేయ్ నువ్వు ఆగు మూసుకొని కూర్చో అంకుల్ ఇటు ఇవ్వండి నేను వెతుకుతా ”

“వద్ధులేమ్మా ఆ అబ్బాయి తప్పుగా అనుకుంటున్నాడు …”

“వీడి మొహం వీన్ని పట్టించుకోవద్దు అంకుల్ నేను సెర్చ్ చేస్తా ఉండండి వంశీ కృష్ణ చూడండి ఇదేనా ఫోటో ”

“హా ఔనమ్మ తనే వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తావా ??” రిక్వెస్ట్ సెంట్  

“ఇంతకి ఎవరు అంకుల్ ఈ అబ్బాయి “

“నా ఒక్క గానొక్క కొడుకు అమ్మ”

“ఏంటి మీ కొడుకా మరి కొడుకికి ఫేక్ ఐడి తో రిక్వెస్ట్ పంపిస్తున్నార ?? “

అవును అని తల ఊపుతూ తల దించుకొని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు ఇద్దరు ..

“అంకుల్ ఏమయింది ఎందుకు ఈ కన్నీళ్లు ??”

“వాడు నా ఒక్కగానొక్క కొడుకమ్మ పెళ్లి అయ్యాక మా నుండి దూరంగా ఆస్ట్రేలియా లో ఉన్నాడు… ఇంత వరకు మమ్మల్ని చూడటానికి ఒక్క సారి కూడా కనీసం ఇంత వరకు ఒక్క సారి కూడా ఫోన్ చేయలేదు …”

ఇద్దరు మౌనంగా వింటున్నారు …

 

“మొదట్లో మమ్మల్ని తీసుకెళ్ళాడమ్మ తరువాత మేము ఉండటం మా కోడలికి నచ్చలేదు చీటికి మాటికి మమ్మల్ని కోపగించుకునేది కొంచం సర్ది చెప్పబోతే గొడవ చేసేది ఒక రోజు నా కొడుకు మాతో మీరు ఉండటం నా పెళ్ళానికి నచ్చడం లేదు మీరు ఇండియా కి వెళ్ళిపొండి అని టికెట్ ఇచ్చి ఎయిర్ పోర్ట్ దగ్గర డ్రాప్ చేసాడు ఆరోజే వాణ్ణి చివరి సారి చూడటం తరువాత వాళ్ళకి పిల్లలు పుట్టారని వేరే వాళ్ళు ఎవరో చెప్తే తెలుసుకున్నాము ..”

 

భార్య మీద చేయి వేసి

 

“ఇదిగో ఈ పిచ్చిది ఉంది కదా మనవళ్ళను చూడాలి కొడుకుని చూడాలి అని రోజు బాధ పడుతూ ఉంటుంది అక్కడికి రెండు మూడు సార్లు కాల్ చేసాము వాడి మా ఫోన్ తీయలేదు ఎవరో చెప్తుంటే విన్నాము ఫేస్బుక్ లో ఫోటో లు పెట్టాడు అని.... ఈ మధ్య నేను విన్న అందరు తమ కుటుంబం ఫోటోలు పిల్లల ఫోటోలు ఇంట్లో జరిగే ఫంక్షన్ ఫోటోలు పెడతారు అని ఫేస్బుక్ లో అందుకే నా పెన్షన్ డబ్బుల్లో ఈ ఫోన్ కొనుక్కున్నా ఆ ఫేస్బుక్ లో ఎలా చూడాలో తెలిదు అందుకే ఈ ఎకౌంటు క్రియేట్ చేపించా”

 

“అంకుల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ డిక్లైన్ చేసాడు మీ అబ్బాయి “

“అవునా కనీసం ఫోటోలు ఉన్నాయేమో చూడమ్మా అందులో??”

“లేవు అంకుల్ ఫ్రెండ్స్ కి మాత్రమే కనపడలేగా పెట్టాడు …”

“మరి ఎలాగమ్మ ఏం చేయాలి ఇప్పుడు”

“ఒక పని చేస్తే ఎవరైనా అమ్మాయి ఫోటో పెడదాము అప్పుడు కచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ఫేస్బుక్ అమ్మాయిలు రిక్వెస్ట్ పంపితే రిజెక్ట్ చేసే అబ్బాయి లేదు అసలు” అని చెప్పాడు కృష్ణ …

“ఓర్ని నీ బుర్ర పాదరసం లాగ పని చేస్తోంది గుడ్ గుడ్... చెప్పండి అంకుల్ ఎవరి ఫోటో పెడదాము ..”

“నీ ఇష్టం అమ్మ మాకు అవన్నీ తెలిదు“

“మ్మ్ హీరోయిన్ ఫోటో పెడతాను అందరు హీరోయిన్ చూసి ఉండదు కదా మీ అబ్బాయి మల్లి రిక్వెస్ట్ పంపిస్తా”

“ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నాడు అంకుల్… ఫోటోలు  చూడండి మీ మనవడు మనవరాలివి ”

ఇద్దరు ఫోటోలు చూసి మురిసిపోతున్నారు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి …

“థాంక్స్ అమ్మ థాంక్స్ బాబు మీ ఋణం ఈ జన్మ లో తీర్చుకోలేము “

“నన్ను క్షమించండి అంకుల్ మీ గుండెలో ఇంత బాధ ఉందని తేలిక మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాను … మీరు చెప్పింది కరెక్ట్ సారీ అన్నిటిని సరి చేయలేదు మీకు ఇప్పుడు కోటి సార్లు సారీ చెప్పిన నేను మిమ్మల్ని అన్నదానికి బాధ పెట్టినదానికి రోజు నన్ను గుండెల్లో పొడుస్తూ ఉంటుంది “

“పర్లేదు బాబు కన్నా వాడు పెట్టిన బాధ ముందు ఇవి ఏవి నన్ను బాధ పెట్టావు ”

"ఈ ఎదవ చూడు రాధా టైం లైన్ మీద అమ్మ నాన్న మీద ఆర్టికల్స్ పోస్ట్ చేసి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు దానికి లైక్ లు కామెంట్ లు దానిలో ఒక కామెంట్ లో ఒక పెద్దాయన రాసాడు నీ లాంటి కొడుకుని కన్నా ఆ తల్లి తండ్రులు చాల అద్రుష్టవంతులు అని ... పేరెంట్స్ ని గాలికి వదిలేసి ఫేస్బుక్ లో తల్లి తండ్రుల మీద వ్యాసాలు అందరికి తల్లి తండ్రుల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు చెత్త గాడు... ఉండు ఈ నా కొడుకు పని చెప్తా"

 

"వద్దు బాబు ఎం చేయొద్దు కనీసం తల్లి తండ్రులు అంటే ప్రేమ ఉంది అని ఇలా అయిన చెప్పాడు కదా ఉందని మీరు ఏదైనా చెప్పి వాడి పరువు పోతే వాడు తట్టుకొలెడు మమ్మల్ని ఇంకా దూరం చేస్తే ఈ ఫేస్బుక్ లో కూడా మా పిల్లల్ని చుసుకోలేకుండా అయిపోతాము"

"సారీ అంకుల్ కోపం లో ఏదేదో తిట్టేసాను పక్కన ఉనింటే తన్ని బుద్ధి చెప్పే వాణ్ణి"

“ఈ ఫోటోలు నా మొబైల్ లో పెట్టుకోవచ్చా బాబు రేపు మళ్లి తీసేస్తే వీళ్ళను చూసుకోలేము కదా వాళ్ళను గుండెల మీద ఎత్తుకొని ఆడించలేకున్నకనీసం మొబైల్ లో చూసుకొని మురిసి పోతాము ఈ వయసులో మాకు ఈ జ్ఞాపకాలు చాలు పొయెలొపల ఒక్కసారి అయిన వాళ్ళను చూస్తే చాలు ఇంకేమి వద్దు ”

“ఇలా ఫోటో క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అది నొక్కితే మీ మొబైల్ లో సేవ్ అవుతుంది ”

“మీరు బాధ పడకండి అంకుల్ తోరలో మీ కొడుకు కోడలు మనసు మార్చుకొని మిమ్మల్ని వెత్తుకుంటూ వస్తారు నేను నమ్మిన ఆ సాయిబాబాను మీ కోసం ప్రార్థిస్తా“ అని రాధా అంటీ చేయి పట్టుకొని బుజం మీద తల పెట్టి ఏడుస్తూ 

“చాల సంతోషం అమ్మ ఇంకా మేము బయల్దేరుతాము” అని అంకుల్ రాధా తల నిమురుతూ 

“అంకుల్ ఎప్పుడు మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టాము పెళ్లి అయ్యాక కూడా ఎప్పుడు బాధ పెట్టాము చిన్న చూపు చూడము మా పిల్లల్ని వాళ్ళ నుంచి ఎప్పుడు దూరం చేయము ఇది మా ప్రామిస్” అని రాధా కృష్ణ ఇద్దరు అంకుల్ చేయి మీద చేయి వేసి చెప్పారు 

ఇద్దరినీ దగ్గరికి తీసుకొని "చాల సంతోషం రా నాన్న మీ ఇద్దరినీ చూస్తుంటే చాల ఆనందంగా ఉంది ఇలాగే ఇద్దరు కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి మమ్మల్ని తప్పకుండ పెళ్ళికి పిలుస్తారు కాదు ??”

“తప్పకుండ అంకుల్ మీ సమక్షం మీ చేతులు మీద జరగాలి మీ ఆశీర్వాదం మాకు ముఖ్యం”

ఒక చిన్న నవ్వు నవ్వి ఇద్దరు బయలుదేరారు ….

ప్రపంచంలో మనం మన అమ్మ నాన్నలకి ఇవ్వాల్సినవి ఆస్తులు అంతస్తులు కాదు ప్రేమ ఆప్యాయతతో నాలుగు గౌరవమైన మాటలు… ఇచ్చుకోగలిగే ఒకే ఒక బహుమానం, ఆస్తి తీపి జ్ఞాపకాలు … వీటిని ఇవ్వగలిగే ప్రతి కొడుకు కూలి వాడు అయిన కొటీశ్వరుడె  … ఇవ్వకుండా భవనాల మధ్య ఉన్న బిక్షగాడే … మీ పిల్లల్ని మీ తల్లి తండ్రుల నుంచి ఎప్పుడు దూరం చేయొద్దు మీ కోసం వాళ్ళు పోగొట్టుకున్న జీవితం మొత్తం మీ పిల్లల రూపంలో తిరిగి పొందుతారు …

 

ఇట్లు తల్లి తండ్రులను అమితంగా ప్రేమించే

 

మీ 

భరత్(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com