ముంబయి పేలుళ్ల కేసు తీర్పు ఈరోజు వెల్లడైంది

- April 06, 2016 , by Maagulf
ముంబయి పేలుళ్ల కేసు తీర్పు ఈరోజు వెల్లడైంది

 ముంబయిలో 2002-03లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక పోటా కోర్టు ప్రధాన నిందితుడు ముజామ్మిల్‌ అన్సారీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వాహిబ్‌ అన్సారీ, ఫర్హాన్‌ ఖోట్‌లకు కూడా జీవితఖైదు విధించింది. కేసులో మరో ముగ్గురు దోషులు సాఖిబ్‌ నచన్‌, అతీఫ్‌ ముల్లా, హసీబ్‌ ముల్లాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మార్చి 29న కోర్టు 13 మంది నిందితుల్లో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆరుగురికి ఇవాళ శిక్ష ఖరారు చేయగా మిగిలిన నలుగురు ఇప్పటికే చాలాకాలం జైలులో గడిపినందున నియమాల ప్రకారం బెయిల్‌ పత్రాలు సమర్పిస్తే విడుదలచేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.2002 డిసెంబరు 6న, 2003 మార్చి 13న జరిగిన ముంబయి పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. 2003 జనవరి 27న పేలుడులో ఓ వ్యక్తి మరణించారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెల్లడైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com