నేడు ప్రపంచ పత్రిక స్వేచ్చా దినోత్సవం

- May 02, 2016 , by Maagulf
నేడు ప్రపంచ పత్రిక స్వేచ్చా దినోత్సవం

           చరిత్ర ఎవరి సిరాతో…??ఉదయించడానికి సిద్ధమౌ తున్న సూర్యుడితో పాటే చేత్తో ఆనాటి దినపత్రిక, మరో చేత్తో టీ కప్పుతో మొదలవుతుంది సగటు భారతీయుడి దినచర్య. పొద్దున్నే లేవగానే ఎవరి మొహం చూడా లి? ఏం చేయాలి? అనే సగటు నమ్మకాలను దాటి చేసే మొదటి దినచర్య పేపర్‌ చదవడం. దినపత్రిక అంటే కేవలం తెల్లకాగితాల మీద నల్ల అక్షరాల ముద్రణ కాదు. ప్రజల మనోఫలకం మీద సమకాలీన సంఘటనల ముద్రణ. మంచీచెడుల సక్రమ విశ్లేషణ. జర్నలిజమే వృత్తి, ప్రవృత్తిగా, దైవంగా ప్రేమించి జీవితాన్ని అంకితమివ్వడానికి సిద్ధపడే మీడియా ఇప్పుడు పిడికెడు మందిది. నెల నెలా ఖర్చులు, జీతాలు, మెయింటెనెన్స్‌ కష్టాలతో సతమతమవుతూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలతో చేత్తో, పక్కదారి పడుతున్న సమాజంతో మరో చేత్తో పోరాడుతూ ప్రభుత్వాలను ఎదిరిస్తున్నందుకు, నిలదీస్తున్నందుకు, ప్రకటనల ద్వారా రావలసిన ఆదాయం సక్రమంగా పొందలేక, ప్రజలకు నచ్చే పిచ్చి రాతలు, మూఢనమ్మకాలను బలపర్చలేక ప్రతి రోజూ సర్కస్‌ చేస్తూనే నమ్ముకున్న సిద్ధాంతాలు, విలువలతో జీవన పోరాటం చేసేవారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా గౌరవించదగ్గ మీడియా వీరిది. మీడియాకున్న అపారమైన విలువను గుర్తించిన కొంద రు జర్నలిజం మీద ప్రేమ అనే దాని కన్నా వ్యాపార అవకా శాలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ యంత్రాంగంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడా నికి మీడియా సంస్థలను ఏర్పాటు చేయడం దగ్గర దారిగా గుర్తించి మీడియా రంగానికి గత దశాబ్దం నుంచి వెల్లువె త్తారు. సహజంగా వ్యాపార దృక్పథంతోనే వచ్చిన వాటిలో జర్నలిజం విలువలు వెదకడం అంటే నేతి బీరకాయలో నేతిని వెతకటమే కదా! ప్రచురించిన ప్రతి వార్త, ప్రసారంచేసే ప్రతి విషయం నిబద్ధతగా ఉండక పోయినా కొద్దో గొప్పో నిజాయితీని ఆశించడం తప్పు కాదు కదా! కానీ వాస్తవానికి 90 శాతం వార్తలు ప్రలోభానికి గురయ్యో లేదా ప్రలోభానికి గురి చేసే స్థాయిలోనో ఉంటున్నాయి తప్ప సామాన్య ప్రజలకు ఉపకరించే రీతిలో ఉండటం లేదు. మీడియా బాధ్యత ప్రజలకు నచ్చినవి ఇవ్వడం, నచ్చి నట్లు ఉండడమా లేక చైతన్యవంతులను చేయడమా? అంటే లాలి పాడి నిద్రపుచ్చడమా? లేక నిద్రపోతున్నవారిని మేల్కొలపడమా? ప్రస్తుతం మాత్రం మొదటిది మహాజోరు గా సాగిస్తోంది. ప్రభుత్వాలకో, ప్రభుత్వ అధినేతలకో కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే పంటి గాటు కూడా తగలకుండా పెదాలతోనే తీసే అద్భుతమైన విద్యలో మీడియా ఆరితేరిపో యింది. పాశవికం, అరాచకం, ఆటవికం, దుర్మార్గం, దారు ణం, ఘోరం, మానవత్వానికి మచ్చ- పదాలు దినపత్రి కల్లోనూ, టీవీల్లోనూ కొన్ని వందల, వేలసార్లు వేస్తూనే ఉంటారు. పదాలే కాదు హైదరా బాద్‌లో పారిశ్రామికవేత్త షష్ఠిపూర్తి కార్యక్రమం జరిగింది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చైనాలో పది హేను రోజులు ప్రజల కోసం పర్యటించినా శ్రమనుకోకుండా విమానంలో దిగి నేరుగా కార్యక్రమానికే విచ్చేశారు. ఇక్క ప్రశ్న ఆయన కానే కాదు. మన మేధావులు కొలువుచేరి ఉన్న అత్యున్నత తెలుగు మీడియా హడావుడి. అక్కడకు వేంచేసిన స్వామీజీ వారి దివ్య దర్శనం కోసం, వారి దివ్య వాక్కుల కోసం, పారిశ్రామికవేత్తగారి దివ్య ప్రసన్నం కోసం లైవ్‌ కవరేజ్‌. ఇందుకా మీడియా ఉన్నదిఅత్యంత పురాతన కాలంలో మన దగ్గర నాగరికత విర జిల్లిన మాట వాస్తవం కావచ్చు. కానీ ప్రస్తుత భారతీయ జీవన విధానం, ఆటవిక నాగరికత, నాగరిక ఆటవికతకు దర్పణంలా ఉంటోంది. జనాన్ని మరింత మూర్ఖులుగా, అజ్ఞా నులుగా, మాత్రం తర్కం తెలియనీయకుండా, విచక్షణ ఏర్పరచుకోకుండా మరింత అగాధంలోకి నెట్టేసే ప్రయత్నా లకు మీడియా ఊతం అందిస్తోంది. చేతబడుల నెపంతో మనుషుల ప్రాణాలు క్రూరంగా తీస్తున్న విషయాలను తిరిగి తిరిగి ప్రసారం చేసే మీడియా, వారే చూపించే వారాలు, ఘడియలు, విఘడియలు, ముహూర్తాలు, రోజు ఏం చేయాలి? ఎటువైపు తిరిగి పడుకోవాలి, రోజు గుడి కెళ్ళాలి, లేవగానే ఎవరి మొహం చూడాలి లాంటి విషయాలు మూఢనమ్మకాలు కాదా? వ్రతం చేసి ఎవరికి దణ్ణం పెట్టి బిల్‌గేట్స్‌ ప్రపంచ కుబేరుడయ్యాడో చెప్పగలరా? మూఢన మ్మకాలను పూడ్చిపెట్టి సమాధి చేయాల్సిన చోట నేను సైతం అంటూ ఇటుకలు పేర్చి పునాదులు పటిష్టం చేస్తూ యజ్ఞ యాగాలకు సమిధలు వేస్తూ, అంకిత భావం చూపించే మీడి యా ఢిల్లీలో అరెస్టయిన ప్రొఫెసర్‌ సాయిబాబా గురించి ఎన్నిసార్లు తెలియజేసింది? బ్రిటన్‌ పార్లమెంటు గుర్తించిన బాలల హక్కుల ఉద్యమవేత్త కైలాశ్‌ సత్యార్థి నోబెల్‌ ప్రైజ్‌ పొందక ముందు ఆయన గురించి దేశానికి ఎప్పుడన్నా తెలియజేసిందా? జూన్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన చెన్నరు ఐఐటి విద్యార్థుల గురించి మీడియాలో ఎంత వరకు తెలియజేశారు? పుణ్యభూమిలో కాయగూరలు, పండ్లు, పాలు, నెయ్యి ఒకటేమిటి సమస్తం కల్తీనే. చివరకు వార్తలకు కూడా మినహాయింపు లేని పరిస్థితి. ఎగిరే పావురాలను బంధించి తీసుకొస్తే, నాయకుల వారు మళ్ళీ వాటికి స్వేచ్ఛను ప్రసా దిస్తూ ఎగురవేయడం చూస్తూనే ఉంటాం. ఇందులో కొత్తగా వారిచ్చిన స్వేచ్ఛ ఎలాంటిదో మధ్య మీడియా ఛేదించే వార్తలు అలానే ఉంటున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అవునో కాదో గాని తెలుగు మీడియా మాత్రం విషయం లో లెస్సే! అంతా బావుంటుందనుకున్న సమయంలో హఠా త్తుగా మంత్రిగా ఉన్న నాయకుడి మీద ఆరోపణలు పత్రి కలో తాటికాయంత అక్షరాలతో వస్తాయి. ప్రజల్లో కొంత మంది ఇంత అన్యాయం జరిగి పోతోందా? అనుకుంటారు. మరికొంత మంది అవినీతి గురించి ఇంత ఆలోచనా, అది మన సనాతన సంప్రదాయం కదా అనుకుంటారు. ఇంతలో ముఖ్యమంత్రిగారు నా కనుచూపు మేరలో అవినీతిని సహించేది లేదు, ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు, కాలేరు అని జస్టిస్‌ చౌదరి సినిమాలో ఎన్టీఆర్‌లా డైలాగ్‌ చెప్పి మంత్రిగారిని పదవి నుండి పీకి పారేస్తారు. జనం ఆహా, ఓహో అంటారు. అంతకు ముందు, తర్వాత చాలా మంది పై అవినీతి ఆరోపణలు, కాదు కాదు, నిరూపితమైనా లేని పట్టింపు అప్పుడే ఎందుకు వచ్చిందో, వ్యక్తిపైనే ఎందుకు వచ్చిందో చాలామందికి అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి మనం మసలాలి. మన పద్ధతులు మార్చుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు బంగారమవుతుంది. మహా మేళ్ళని మరవాలన్నా, మించాలన్నా మీడియాకు మాత్రం సడలింపు తప్పవని మీడియా సంస్థ నమ్మింది మరి. విభజన ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిం దన్నది ఒప్పుకోవల్సిన విషయమే. ఆర్థికంగా కడుదీన పరిస్థి తిలో ఉన్న సంగతీ విదితమే. ఇన్ని విషయాలు ప్రజలకు చేర వేసిన వారు ఇంత పేద రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్న ముఖ్య మంత్రి విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు (100 కోట్లని అంచనా) ఖర్చు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిం చారా? ఎక్కడైనా నిర్మాణం పూర్తయ్యాక పదిమందిని పిలిచి చూపించి భోజనాలు పెట్టి వాళ్ళ అభినందనలు పొందాలని సహజంగా కోరుకుంటారు. కానీ ఇంజనీర్‌ గీసి చ్చిన ప్లాన్‌కు సింగపూర్‌ గ్లాస్‌ వేసి, జపాన్‌ ఫ్రేమ్‌ కట్టించి, బ్యాంక్‌ మేనేజర్‌ను ముఖ్య అతిథిగా పిలిచి ఉన్న డబ్బంతా శంకుస్థాపనకే ఖర్చు పెట్టే దార్శనిక నాయకుణ్ణి, మేధావిని ఏమనాలి? ఏముంది?   పోనీ పాపం ఇల్లు కట్టుకోవాలని ఆరాటపడుతున్నాడు ఎలా గూ లోన్‌ ఇస్తానని ఒప్పుకున్నా కదా, నలుగురి ముందూ మాట చెప్తే సంతోషపడతారని కాక బ్యాంక్‌లో మట్టి, బయ కుళాయిలో నీరు ఇచ్చే మేనేజర్‌ను ఏమందాం? మోడీనే కదా! మన పత్రికలు, మీడియా ఇంత భయంకరమైన సిల్లీ విషయానికి ఎంత భారీ కవరేజ్‌ ఇచ్చాయో ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి. మధ్య స్వామీజీ ఆధ్యాత్మిక ఛానెల్‌ పెడుతూ తను చిన్నప్పుడు పడ్డ కష్టాలను వివరిస్తున్నప్పుడు సెలబ్రిటీ గారి కళ్ళలోంచి చిన్న బిందువు కనుకొసల్లోకి వచ్చింది. ఎంతో చురుకైన మన మీడియా వెంటనే జూమ్‌ చేసి ము త్యం లాంటి బిందువు చూపించింది. మరి ఇన్నా ళ్ళుగా ఆశాలు, అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు రోడ్ల మీదకు వచ్చి నినదించి, నిరసించి, నీరసించి కళ్ళ వెంట నీ ళ్ళు కాదు, రక్తధారలు కారుస్తున్నా మన మీడియాకు ఎందుకు కనిపించడం లేదు? నేరం చేశారని మున్సిపల్‌ కార్మికులపై ఇన్నాళ్ళుగా వేధింపులు? ఎవరన్ని అనుకున్నా సఫాయి కార్మికులు దేవుళ్ళే కదా! మీ మలమూత్రాలు ఎత్తిపోస్తేనే తల్లిని దేవతని మొక్కు తావే, నీ కుటుంబం మొత్తం మల మూత్రాలు ఎత్తిపోసి చాలీచాలని జీతంతో అల్లాడుతున్న అల్పజీవులు సఫాయి కార్మికుల అర్థవంతమైన కోరిక పాలకు లకు కరకుగా కనిపిం చిందే ఎంత అన్యాయం? ఇంటి ముం దు నాలుగడుగులు ఊడ్చి అలసిపోయి నడుం పట్టుకుం టారే, మరి ఊరంతా ఊడ్చి శుభ్రం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులలో మన అక్క, చెల్లి, అమ్మ కనబడ్డం లేదా? సక్రమం గా జీతాలు ఇవ్వండి, సరిపడా ఇవ్వండి అని అడగడంలో బెదిరింపు కనబడుతోందా? అంగన్‌వాడీలు, ఆశాలు ఏమ డుగుతున్నారు? అవినీతిలో వాటాలా? వేల ఎకరాల భూ ములా? మణులా, మాణిక్యాలా? కడుపు నిండా తిండి, అవి తీర్చడానికి లేని డబ్బులు, విదేశీ యాత్రలకు, విదేశీ కార్ల కాన్వాయిలకు, అధునాతన భవంతులకు మీకెక్కడి నుంచి వస్తున్నాయని ఒక్కసారైనా ప్రశ్నించగలిగారా? మీడియా మిత్రులారా! నిజం చాటి చెప్పేందుకు మీ ప్రాణాలు బలివ్వ మనో, సాహసం చేసి అక్రమాలు బయట పెట్టమనో ఆశిం చడం లేదు. కనీసం వాస్తవం తెలియజెప్పండి. అదీ కాదంటే చేత కాదని చేతు లెత్తేయండి. అంతేకాని అర్థ సత్యాలను, అబద్ధాలను రంగులు వేసి ప్రజల కళ్ళకు కట్టకండి

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com