రమదాన్ లో

- June 09, 2016 , by Maagulf
రమదాన్ లో

 ఇస్లాం మతానికి పునాది అయిన దివ్య ఖుర్ ఆన్ అవతరించిన మాసమే రమదాన్. ప్రతి ముస్లిం 5 ప్రాధమిక విధుల ద్వార ఇస్లాం లో ముందుకు పయనిస్తారు. కలిమ చదవడం,ప్రతి రోజు 5 పూటల నమాజ్ చదవడం రమదాన్ నెలలో ఉపవాసాలు వుండటం ,తను సంపాదించినా దాంట్లో కొంత భాగాన్ని(2.5`/.) దాన ధర్మాలు చేయడం..హజ్ యాత్ర చేయడం .. ఇస్లాం ను ఆచరించే ప్రతి ఒక్కరి పై ఉపవాసాలు (రోజా ) వుండటం విధి.( రోగ పిడితులు ,బాలింతలు , పసి పిల్లలకు మినహయింపు వుంది )సూర్యోదయానికి ముందు , సుర్యస్తమయమ అయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు .ఆఖరికి లాల జలాన్ని సైతం మింగకుండదు.అబద్దలడకూడదు , అధర్మమం వైపు వెళ్ళకూడదు ...ఈ దీక్ష ద్వార ముస్లిం లకు ఆకలి దప్పికల విలువ తెలిసి పేదసాదలకు తమ వంతు సహాయం అందిస్తారన్నది దీని పరమర్దామని ముస్లిం పెద్దలు అంటారు .బలహినతలనేవి మనవ సహజం , రకరకాల సుఖాల లాలసలో పడిపోవడం మనవ నైజం.. అయితే ఈ సుఖాల్లో సైతం సానుకులమైనవి , మనిషిని సర్వనాశనం చేసేవి రెండు వుంటాయి .అయితే ప్రతికులమైనవే మనిషి ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వాతో పట్లనే మనిషి ఎక్కువగా మొగ్గు చుపుతుంటాడు .ఆ బలహీనతల ఆగడం లో కురుకు పోయి పతనం ఆఖరి అంచులకు తకుతాడు .మనిషి శరీరమ్ మాత్రమే కాదు ఒక ఆత్మ లేదా మనసు అనేది కూడా వుంటాయి . మనవ వివేకానికి , విచక్షణ జ్ఞాననికీ ఇదే పునాది. మనిషి ఆత్మ కు శరీరానికి మద్య ఒక నిరంతరం ఘర్షణ వుంటుంది. ఈ ఘార్షణ లో మనిషి శరీరం వైపా ఆత్మ వైపా ...ఎలా మొగ్గుతడన్నదే కీలకం. ఈ అంశం మనిషి స్ధాయి ని నిర్ణఇస్తుంది . రోజా లాంటి పవిత్రమైన దీక్ష ద్వార చెడు ఆలోచనలకూ స్వస్తి పలికి `రిఫ్రెష్ ` అవుతారని ప్రగడ నమ్మకం.ఆత్మను నిద్రపుచి కేవలం శరీరాన్ని మేల్కొలిపే సంస్కృతీ సంప్రదాయాలకు ఇస్లాం బద్ద వ్యతిరేకం .ఆత్మ కు శరీరానికి మద్య శాంతియుతమైన సమన్వ్యయం ఒక ఆరోగ్యకరమైన మానవజాతి మనుగడకు చాల అవసరం . అందుకే ఇస్లాం పదే పదే చెబుతుంది `నియ్యత్ కే ఊపర్ ఫైస్లె` ( మన బుద్ది ని బట్టి దైవ నిర్ణయాలు వుంటాయి ) అనీ ..ఇలా పవిత్ర హృదయం తో కటోరంగా నెల అంత చేసే దీక్ష ప్రభావం మిగత 11 నెలల పై వుంటుంది అన్నది వో నమ్మకం ...దీనికి పూర్వం ఉనికిలోకున్న సమాజాలకు కూడా రోజా నియమాన్ని తప్పనిసరి చేసామని ప్రభోదిస్తుంది దివ్యఖురాన్ ...దివ్య ఖురాన్ భోదనల ప్రకారం వివిధ కాలాలలో వివిధ ప్రవక్తల ద్వార ఒక చారిత్రక క్రమంలో రూపు దిద్దుకుంటూ వచ్చిన ధర్మానికి కొనసాగింపే `ఇస్లాం `...అంటే తప్ప , ఇస్లాం మతం అంతిమ దైవ ప్రవక్త ,మొహమ్మద్ ( సో. ఆలే .సో ) తోనే ఉనికి లోకి వచిందని చెప్పడం సమంజేసం కాదు .ప్రవక్త ఇబ్రహీం ( అ ) అనుయాయులు చంద్రోపసన లక్ష్యం గా సూర్యోదయం నుంచి సుర్యోస్తమయం వరకు ఆహార పానీయాలు ముట్టుకోకుండా ముప్పయి దినాలు ఉపవాస దీక్ష పాటిస్తారు .ప్రవక్త మూసా (అ )గురువారం నాడు సినయే పర్వతం వద్ద కు వెళ్లారు.సోమవారం నాడు తిరిగి వచ్చారు .అందుకే యుదు మతస్తులు ప్రతి గురువారం, సోమవారం దీక్ష చేస్తారు . ఆది క్రైస్తవులు ఆదివారం మినాహా యించి నికరంగా 34 రోజులు ప్రవక్త ఈసా (అ )స్మృత్యర్ధం ఉపవాసం పాటించే వారు .మనవ శరీరాన్ని ఆత్మ నీ అనుక్షణం అవహించేందుకు ప్రయత్నించే అన్నిరకాల అస్వస్తతలను అదిగమించేందుకు ఇస్లాం సూచించిన ఒక ఆద్యాత్మిక పరమఔశదమ్ నమాజ్ కాగా , దానిని అనుభందంగా పాటించవలసిన పద్యవిసేషమే రోజా ...

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com