ఓ తండ్రి యాదిలో

- June 19, 2016 , by Maagulf

ఎండిన డొక్కలతో నీ పోరాటం

నీ కష్టం నీ చెమట ధారలతో
మాకు బ్రతుకు ద్వారాలు
తెరిచావు,

మాకంటు ఓ అస్థిత్వపు
రూపునిచ్చావు

అలిగిన వేళలో బుజాన ఎత్తుకుని
నీకు తోచిన కథ చెప్పి నవ్వించావు

ఏడ్చి మారాం చేసే నన్ను దండించే
తల్లికి, ఆ క్షణాన శతృవయ్యి నువ్వు
ఎప్పుడూ నాకు కొండంత అండవయ్యవు

గడ్డి పెట్టి ప్రేమగా నిమిరావో
నువ్వు వాటిని అదిలించి
లాలించావో,

అవి నిన్ను తన వాడిగా భావించి
పంట పండించి కుటుంబానికి
తిండి పెట్టి కాలం చేసాక,

నువ్వు ఏడ్చిన తీరు, నువ్వు పెట్టిన
కన్నీళ్ళతో జీవాల మీద నీ దయా గుణాన్ని
నేర్పావు

ఎవరిని నొప్పించని మౌన బాషతో నువ్వు
మాకు మనుషులతో ప్రేమగా మసులుకునే
తత్వం బోధించావు

తగని రోగంతో మంచాన పడి
అయ్యో కొడుకులకు..భారమై
ఖర్చు పెట్టిస్తున్నానే అని మధన పడి

నీ నిస్వార్థ ప్రేమని త్యాగాన్నొసగి
ఆజన్మాంతం మా గుండె గదిలో
నీ స్తానాన్ని ఏర్పరుచుకొని ..

వెళ్ళిపోయావు బౌతికంగా
'ఓ తండ్రి' నీకిదే నా ప్రణామ్.

 

--జయరెడ్డి బోడ (అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com