ప్రముఖ డెర్మటాలొజిస్ట్ చిత్తర్వు కరిష్ని తో మాగల్ఫ్ ముఖాముఖి

- March 19, 2025 , by Maagulf
ప్రముఖ డెర్మటాలొజిస్ట్ చిత్తర్వు కరిష్ని తో మాగల్ఫ్ ముఖాముఖి
ప్ర: మొహం మీద మొటిమలు వల్ల ఏర్పడ్డ మచ్చలు, గుంటలు శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి?   
 
జ:మొహం మీద మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు (Post-Inflammatory Hyperpigmentation) మరియు గుంటలు (Acne Scars) పూర్తిగా తగ్గించేందుకు వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
మచ్చల కోసం:
హైడ్రోక్సీ యాసిడ్స్ (AHAs, BHAs) మరియు రెటినాయిడ్స్‌ కలిగిన క్రీములను వాడటం.
      కోజిక్ ఆసిడ్ వంటి డిపిగ్మెంటింగ్ క్రీమ్స్
కెమికల్ పీల్స్ (గ్లైకొలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ పీల్స్).
లేజర్ థెరపీ (Pigment removal laser like Nd Yag laser)
మైక్రోనీడ్లింగ్.
సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి, minimum 30 SPF (80 SPF kuda andubatulo unnai)లేదంటే మచ్చలు మరింతగా ముదురు రంగులోకి మారవచ్చు
 
గుంటల కోసం:
డెర్మాబ్రేషన్ లేదా మైక్రోడెర్మాబ్రేషన్.
లేజర్ రీసర్‌ఫేసింగ్ (Fractional CO2 Laser, Erbium Laser).
ఫిల్లర్లు లేదా సబ్‌సిజన్ టెక్నిక్‌ను ఉపయోగించడం.
PRP (Platelet-Rich Plasma) ట్రీట్మెంట్
Dermaroller with PRP
Subcision with PRP
Punch elevation 
Peels - TCA , Salicylic Acid
 
ప్ర: సోరియాసిస్‌ను ప్రారంభ దశలోనే ఎలా పసిగట్టాలి? పూర్తి స్థాయిలో రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి?
 
జ: ప్రారంభ లక్షణాలు:
పొడిగా, వెండి రంగు పొరలతో కూడిన ఎర్రటి మచ్చలు (Plaques).
ఎక్కువగా మోకాల్లు, మెడ, elbows,(extensors) తల మీద కనిపించడం.
 
Recurrent ga dandruff laga ravadam
Talalo pottu raladam 
 
కొంతమందిలో కీళ్ళ నొప్పులు (Psoriatic Arthritis) కూడా కనిపించొచ్చు.
 
నివారణ చర్యలు:
స్ట్రెస్‌ను తగ్గించుకోవడం (మెడిటేషన్, యోగా చేయడం).
చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజర్లు, స్పెషల్ సోప్స్ వాడటం.
కఠినమైన కెమికల్స్ కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్, పరఫ్యూమ్స్ వాడకూడదు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం (ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆకుకూరలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం).
ఆల్కహాల్, ధూమపానం మానేయడం.
Injuries avakunda chuskovali 
డెర్మటోలజిస్ట్ సలహా తీసుకొని, అవసరమైనప్పుడు మందులు వాడడం.
 
Psoriasis cannot be cured it can only be managed
 
ప్ర: మొహం మీద చీము గుళ్ళలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వాటి నివారణకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
 
జ: కారణాలు:
హార్మోనల్ మార్పులు (ఇంక్రీస్డ్ ఆండ్రోజెన్ హార్మోన్స్).
జిడ్డు చర్మం (Oily Skin) - seborrhoea, వల్ల బ్యాక్టీరియా పెరుగుదల.
మెరుగులేని ఫుడ్ హాబిట్స్ (జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం).high glycemic index foods
క్రమంగా ముఖం శుభ్రం చేసుకోవకపోవడం.
 
నివారణ:
రోజుకు రెండుసార్లు సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ కలిగిన ఫేస్ వాష్ వాడాలి.
నాన్-కోమెడోజెనిక్ మాయిశ్చరైజర్ మరియు సన్‌స్క్రీన్ వాడాలి.
మొహం తాకకుండా ఉండాలి, ఎందుకంటే బాక్టీరియా వ్యాపించవచ్చు.
బలమైన రసాయనాలు, ఫేక్ క్రీములు వాడకూడదు.
అధికంగా చక్కెర ఉండే ఆహారాలు తగ్గించాలి, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ (విటమిన్ E, ఓమేగా-3) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
 
ప్ర: వేసవి కాలంలో చర్మ సౌందర్యం డ్యామేజ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?
 
జ: చర్మ సంరక్షణ:
బయటకు వెళ్లే ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.
నేరుగా ఎండలో ఎక్కువ సమయం గడపకూడదు.
ఎక్కువ నీరు త్రాగాలి, తేమను కాపాడుకునే మాయిశ్చరైజర్ వాడాలి.
 
ఆహారం:
నీటిసారమైన పండ్లు (తర్బూజ, కేరట, కీరా).
విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహారం (నారింజ, లెమన్, కివి).
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం (గింజలు, మొలకెత్తిన విత్తనాలు).
 
ప్ర: సౌందర్యం పట్ల అబ్సెషన్ అధికమవడం భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారితీయవచ్చు?
జ:  కృత్రిమ ఉత్పత్తుల వాడకం పెరిగి చర్మ సమస్యలు (అలర్జీస్, ఇన్ఫెక్షన్స్) ఎక్కువ కావచ్చు.
ఆత్మవిశ్వాసం బాగా తగ్గి, ‘పర్ఫెక్ట్ లుక్’ కోసం మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
అనవసరమైన కాస్మెటిక్ సర్జరీలు, ట్రీట్మెంట్స్ ద్వారా ఆరోగ్యానికి హాని.
సమాజంలో నకిలీ అందచందాల ప్రమాణాలు పెరిగి, సహజ అందాన్ని తక్కువగా చూడటం.
 
సౌందర్యం పట్ల శ్రద్ధ ఉండటం తప్పు కాదు, కానీ సహజ అందాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైన చర్మ సంరక్షణ, హెల్దీ ఆహారం ద్వారా సహజ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
Recently psycho dermatology is booming up 
 
ప్ర: చిన్న వయస్సులోనే బ్యూటీ పార్లర్లకు వెళ్లడం వల్ల యుక్త వయస్సులో సహజ సౌందర్యం మాయం అవుతుందా?
జ:  చిన్న వయస్సులో ఎక్కువ కెమికల్ ట్రీట్మెంట్స్ (బ్లీచింగ్, హెయిర్ స్ట్రెయిటెనింగ్, ఫేషియల్) చేయడం వల్ల చర్మం సహజ రక్షణ కోల్పోతుంది.
కొంతమంది పిల్లల్లో చర్మంపై అలర్జీలు, సున్నితత్వం పెరుగుతాయి.
లాంగ్ టర్మ్‌గా స్కిన్ ఏజింగ్ త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.స్కిన్ బ్యారియార్ డ్యామేజ్ అవుతుంది.
 
--డాక్టర్ చిత్తర్వు కరిష్ని(ఎం.డి డెర్మటాలజీ,వెనిర్యోలోజి & లెప్రసీ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com